బిగ్ బాస్ ఏడోవారం టాస్క్ లు మాములుగా లేవని చెప్పాలి.. రోజు రోజుకు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు శృతి మించి పోతున్నాయి.. ఏడోవారం కెప్టేన్సీ టాస్క్‌లో భాగంగా గులాబీపురం, జీలేబీపురం అనే రెండ్ టీమ్‌లుగా బిగ్‌బాస్ విభజించారు. తాజాగా గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో అన్ని బూతులే ఉన్నాయని చెప్పాలి.. అందులో కొందరు కంటెస్టెంట్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయారు. ఇక టాస్క్‌లో భార్యభర్తలుగా ఉన్న టేస్టీ తేజ, శోభా శెట్టి నవ్వించే ప్రయత్నం చేశారు. ఆ రోజుకు ఫస్ట్ నైట్ జరిగి ఏడాది అయిందని చెబుతూ కామెడీ చేస్తారు…
ఇక ఆ తర్వాత ఈ రెండు గ్రూపుల మధ్య సూపర్ టఫ్ టాస్కులు పెడుతున్నాడు. ఇక ఏలియన్ తన గ్రహానికి వెళ్లేందుకు ఫ్యూయల్ కావాలని.. అందుకు కంటెస్టెంట్స్ సాయం చేయాలని చెప్పిన బిగ్ బాస్.. అందుకోసం ఓ టాస్క్ పెడతాడు. సిమ్మింగ్ పూల్లో లాక్ వేసిన బాక్స్ పెట్టి.. బయట వాటికి సంబంధించిన కీస్‌ను పెట్టి ఓపెన్ చెయ్యాలని బిగ్ బాస్ చెప్తాడు.. అందులో ఉన్న కీని ట్రై చేస్తూ.. స్విమ్మింగ్ పూల్లో ఉన్న బాక్స్ ఓపెన్ చేయాలని టాస్క్ ఇస్తాడు.. ఈ టాస్క్ ను ముందుగా ఎవరైతే ఫినిష్ చేస్తారో వారే విజేతలని చెబుతాడు బిగ్ బాస్..
ఈ టాస్క్ లో సందీప్, అమర్ స్విమ్మింగ్ పూల్లో కలబడతారు. బాక్స్ తాళం తీసే క్రయంలో.. కాలర్ పట్టుకుని కొట్టుకున్నంత పని చేస్తారు. అందులో సందీప్ అయితే… అమర్‌ను కాస్త ఓవర్‌గా ఫిజికల్ అయినట్టు కనిపిస్తారు. కానీ ఫైనల్‌గా.. సందీప్, ప్రియాంక తెలివిగా ఆడడంతో గెలుస్తారు.. దీని తర్వాత బిగ్ బాస్.. హౌస్‌లోకి బ్లాక్ ఫారెక్ట్ కేక్ పంపిన బిగ్ బాస్.. ఆ కేక్‌పై శోభ పేరును.. తేజకు.. ముందుంది ముసళ్ల పండగ అని వార్నింగ్‌ను పంపిస్తాడు. దీంతో ఈ కేక్‌ను తినాలా వద్దా .. తింటే ఎమవుతుంది. దీని వల్ల హౌస్‌లో తనకు ఏదైన ప్రమాదం వస్తుందా అని ఓ పక్క తేజ ఆలోచిస్తుండగానే.. అమర్ కేక్ తినేందుకు రెడీ అవుతాడు… మొత్తంగా కేకును కట్ చేసి తింటారు.. ఆ తర్వాత అందరు కూర్చొని మాట్లాడుతుంటారు.. ఈరోజు వారికి శోభనం జరిపిస్తారా.. లేదా గొడవలు పెట్టి విడగొడతాడా చూడాలి..