NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: హౌస్ నుంచి అశ్విని ఎలిమినేట్.. ఎన్ని లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

Aswinii

Aswinii

తెలుగు బిగ్‏బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది అశ్విని. దాదాపు ఐదు వారాల తర్వాత ఆమె బిగ్‏బాస్ హౌస్ లోకి వెళ్లింది… తన ఆటతో ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది.. ప్రతివారం నామినేట్ అవుతూ ఎలిమినేషన్ చివరి వరకు వెళ్లొచ్చింది. కానీ పన్నేండవ వారం మాత్రం సెల్ఫ్ నామినేట్ అయ్యింది. ఇంట్లో ఉన్న సభ్యులను నామినేట్ చేసేందుకు తన దగ్గర కారణాలు ఉన్నాయని ముందే శోభాతో డిస్కస్ చేసింది అశ్విని. కానీ నామినేషన్స్ ప్రక్రియలో మాత్రం తన వద్ద రీజన్స్ లేవంటూ చేత్తులేసింది. దీంతో ఆమెను పలుమార్లు హెచ్చరించిన బిగ్‏బాస్ .. సెల్ఫ్ నామినేట్ అయిపోతారని చెప్పాడు.. అలానే జరిగింది..

ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో శనివారమే ఓ ఎలిమినేషన్ జరిగిపోయింది. అతి తక్కువ ఓటింగ్ రావడంతో నిన్ననే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అశ్విని. అయితే ఇప్పుడు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.. వైల్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు వారానికి రూ.2 లక్షల చొప్పున దాదాపు రూ.14 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వచ్చిన వారిలో అశ్విని ఎక్కువ మొత్తం అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఐదురుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాగా.. అందులో అశ్విని ఒకరు. ఇప్పుడు ఇంట్లో కేవలం అర్జున్ మాత్రమే ఉన్నాడు. అయితే అశ్విని సెల్ఫ్ నామినేట్ కావడానికి కారణం ఇంట్లో ఉండడం ఇష్టం లేకే అని టాక్ నడుస్తుంది..

అశ్విని ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరితో కలిసి ఉండలేకపోయింది.. తనతో ఎవరు మాట్లాడట్లేదని సీరియల్ బ్యాచ్ తో గొడవ పెట్టుకుంది. ఇక రాగానే ప్రియాంకతో మొదలైన గొడవ మాత్రం హౌస్ నుంచి బయటకు వచ్చేవరకు సాగింది. ఇద్దరు ఉప్పు, నిప్పులా కనిపించారు. ఇక ఇప్పుడిప్పుడే శోభాతో తనకు స్నేహం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. అంతుకు ముందు ఎక్కువగా భోలేతో ఉండేది అశ్విని. కానీ భోలే వెళ్లిన తర్వాత అశ్విని ఒంటరి అయిపోయింది. ఆ తర్వాత మెల్లగా శివాజీ, ప్రశాంత్, గౌతమ్ తో క్లోజ్ అయ్యింది.. అయిన గేమ్ లలో పెద్దగా రాణించలేకపోయింది.. ఈరోజు స్టేజ్ మీదకు నాగార్జున పిలవనున్నారు.. ఈరోజు ఎపిసోడ్ సందడిగా సాగనుంది..