బిగ్ బాస్ సీజన్ 7 ఈవారం నామినేషన్స్ హీటెక్కించాయి. ముఖ్యంగా అమర్, అర్జున్ నామినేషన్స్ చూసి అడియన్సే అవాక్కయ్యేలా చేశారు. గతవారం తమకోసం నిలబడ్డవారినే తిరిగి నామినేట్ చేశారు.. ప్రశాంత్ ను అమర్ నామినేట్ చెయ్యడంతో ప్రశాంత్ ఎమోషనల్ అవ్వడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అర్జున్ నామినేట్ చేయడంతో ఎమోషనల్ అయ్యాడు శివాజీ. ఇక ఎప్పటిలాగే ఆనవాయితీ ప్రకారం శివాజీని నామినేట్ చేశాడు గౌతమ్.
శోభా, ప్రియాంకలు శివాజీ, యావర్, ప్రశాంత్ ను నామినేట్ చేశారు. హౌస్ లో 8 మంది ఉన్నారు.. ఒక్క అమర్ తప్ప మిగిలిన అందరు నామినేట్ అయ్యారు.. ముందుగా ప్రశాంత్ శోభాను నామినేట్ చెయ్యగా,ఆ తర్వాత ప్రియాంకను నామినేట్ చేశాడు. శోభాను డెడ్ కాకుండా నువ్వు కాపాడావ్ అది నచ్చలేదంటూ రీజన్ చెప్పాడు. ఇక తర్వాత మాత్రం ఆనవాయితీగా గౌతమ్ శివాజీని నామినేట్ చేశాడు. ముందుగా ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ ఎవిక్షన్ పాస్ వచ్చిన తర్వాత గేమ్ ఆడలేదంటూ రీజన్ చెప్పాడు.. శోభా, ప్రియాంకలు తగ్గకుండా శివాజీని నామినేట్ చేశారు..
ఇక శివాజీని.. అర్జున్ ను నామినేట్ చేశాడు. ఫ్రెండ్షిప్ బ్యాండ్ నాకు వేస్తే నిజం అనుకున్నాను. కానీ నువ్వు గేమ్ ఆడుతున్నావని తెలిసి ఉంచుకోవడం కరెక్ట్ కాదంటూ తీసేశాడు. నీకు కెప్టెన్ కావాలనే ఇంట్రెస్ట్ లేకపోతే నాకు ముందే చెప్పేస్తే అంత డిస్ట్రబెన్స్ అయ్యేది కాదు. శోభా ఏడవడం ఎందుకు.. అప్పుడే నువ్వు ఎందుకు చెప్పలేదు.. అదే విధంగా గౌతమ్ కూడా శివాజినీ నామినేట్ చేశారు.. మొత్తానికి అందరు కలిసి శివాజినీ టార్గెట్ అయినట్లు తెలుస్తుంది.. అలా ఈ వారం నామినేషన్స్ హీటేక్కించాయి..