NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: అమర్ కు పెరిగిన ఓట్లు.. టాప్ 3 లో ఆ ముగ్గురు?

Bigg Boss7 (7)

Bigg Boss7 (7)

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కు ఈ వారంతో శుభం కార్డు వెయ్యనున్నారు.. దాదాపు 15 వారాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ షో ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది.. అయితే ఈసారి విన్నర్ పై జనాల్లో రెట్టింపు ఆసక్తి కనబడుతుంది.. ఇక డిసెంబర్‌ 17 బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే నిర్వహించనున్నారు. 14 వారంలో శోభా శెట్టి ఎలిమినేట్‌ కగా మిగిలిన ఆరు కంటెస్టెంట్స్‌ గ్రాండ్‌ ఫినాలేకు దూసుకెళ్లారు. అందులో అర్జున్‌ అందరి కంటే ముందు ఫినాలే టిక్కెట్ సొంతం చేసుకోగా.. ప్రియాంక సెకెండ్‌ ఫైనలిస్టుగా కన్ఫర్మ్‌ అయ్యింది. వీరితో పాటు పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్‌, ప్రిన్స్‌ యావర్‌ బిగ్‌ బాస్‌ టైటిల్‌ రేసులో ఉన్నారు..

ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ హౌస్ లో జర్నీ వీడియోను బిగ్ బాస్ చూపించారు..అమర్‌ దీప్‌, అలాగే అంబటి అర్జున్‌, శివాజీల బిగ్ బాస్‌ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇవి ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఓటింగ్‌ కూడా భారీగా పెరుగుతోంది. నిన్నటివరకు నమోదు అయిన ఓటింగ్ ను చూస్తే రైతు బిడ్డ టాప్ లో ఉన్నాడు.. అలాగే సెకండ్ లో శివన్న, మూడో స్థానంలో అమర్ ఉన్నట్లు తెలుస్తుంది..

అదే విధంగా నాలుగో స్థానంలో యావర్, ఐదులో అర్జున్, ఆరులో ప్రియాంక ఉన్నట్లు తెలుస్తుంది.. బిగ్‌ బాస్‌ ఓటింగ్‌ ముగియడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. మరి ఈ మూడు రోజుల్లో ఈ ఓటింగ్ ఏమైనా మారుతుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఓటింగ్‌ సరళిని చూస్తుంటే పల్లవి ప్రశాంత్ లేదా శివాజీ ఇద్దరిలో ఒకరు బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఇక సోషల్ మీడియాలో మాత్రం పల్లవి ప్రశాంత్ విన్నర్ అని మారు మోగుతుంది.. అతని ఫ్యాన్స్ కు అదే కరెక్ట్ అని సంబరాలు చేసుకుంటున్నారు.. ఎవరు విన్నర్ అవుతారో మరో మూడు రోజుల్లో తెలియనుంది..

Show comments