Site icon NTV Telugu

Bigg Boss Telugu 7: శివాజీ పై సహనం కోల్పోయిన గౌతమ్.. ప్రశాంత్ కు వార్నింగ్ ఇచ్చిన అమర్..

Bigg Boss Goutham

Bigg Boss Goutham

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగో ఎలిమినేషన్ కోసం రంగం సిద్ధం చేశారు.. సోమవారం, మంగళవారం ఎపిసోడ్స్ నామీనేషన్స్ తో హీటెక్కుతున్నాయి.. ఈ వారం నామినేషన్లని కోర్ట్ రూమ్‌ తరహాలో ప్లాన్‌ చేశారు. ఒకరు ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంటుంది.. బిగ్‌ బాస్‌ తెలుగు 7 వ సీజన్‌ నాల్గో వారం నామినేషన్ల ప్రక్రియ యమ రంజుగా సాగుతుంది. ఒకరిపై ఒకరు చేసుకునే వాదనలు పీక్‌లోకి వెళ్తున్నాయి. కంటెస్టెంట్ల అసలు రూపాలు బయటకు వస్తున్నాయి. ఎవరు ఫేక్‌, ఎవరు జెన్యూన్‌, ఎవరిది డబుల్‌ గేమ్‌, ఎవరిది సేఫ్‌ గేమ్‌ అనే విషయాలు స్పష్టమవుతున్నాయి. అదే సమయంలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. హౌజ్‌లో ఇప్పటి వరకు కూల్‌గా, సైలెంట్‌గా ఉన్న వాళ్లు కూడా కోపంతో రెచ్చిపోతున్నారు.. ఒకరు ఇద్దరిని నామినేట్ చేస్తున్నారు..

ఇందులో జ్యూరీగా ఉన్న సభ్యులు శివాజీ, శోభా శెట్టి, సందీప్ వారి వాదన, చెప్పే కారణాలు ఎంత బలంగా, సరైన విధంగా ఉన్నాయనేది చూడాల్సి ఉంటుంది. దాని ప్రకారం నామినేషన్లని అంగీకరిస్తారు. సోమవారం ఎపిసోడ్‌లో ప్రియాంక, రతికలను నామినేట్‌ అయ్యారు.. యావర్, గౌతమ్ లు కొట్లాటకు దిగారు..ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. దీంతో గొడుకు నేలకేసి కొట్టిన గౌతం.. శివాజీపైకి వెళ్లాడు. నువ్వెంత.. నువ్వెంత అంటూ ఫైర్‌ అయ్యాడు. హౌజ్‌ని హీటెక్కించాడు.. మధ్యలో అమర్ కలుగ చేసుకొని గౌతమ్ ను కూల్ చేశాడు..

అమర్‌ దీప్‌ వంతు వచ్చింది. ఆయన శుభ శ్రీ, పల్లవి ప్రశాంత్‌ని నామినేట్‌ చేశాడు. ఇందులో మాస్క్ అనేది ఎవరూ ఉంచుకోవద్దని, ఫెయిర్‌గా ఉండాలని అంతా భావిస్తారు.. కంటెండర్‌గా అనౌన్స్ చేసినప్పుడు నువ్వు లోపలికి వెళ్లి ఏడ్చావు చూడు అది రెండో ముఖం అని అమర్‌ దీప్‌ చెప్పగా, పల్లవి ప్రశాంత్‌ సెటైరికల్‌గా నవ్వాడు. దీంతో మండిపోయిన అమర్‌ దీప్‌.. అరేయ్‌.. నువ్వు సెగలుగా నవ్వద్దు చెప్తున్నాను అంటూ హెచ్చరించాడు.. అలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది..ప్రపంచంలో పల్లవి ప్రశాంత్‌ అనేవాడు ఒక్కడే ఉంటాడు. నేను ఇలానే ఉంటాను, బరాబర్‌ ఉంటానని తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గట్టి వాదనలు జరిగాయి.. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Exit mobile version