బిగ్ బాస్ ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ వాడి వేడిగా సాగుతుంది.. వారం రోజులుగా జరిగిన టాస్కులలో చివరకు ఐదుగురు హౌస్మేట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు.. వీరిలో ప్రియాంక, శోభా, గౌతమ్, పల్లవి ప్రశాంత్, సందీప్ నిలిచారు. ఇక వీరిలో ఇప్పుడు కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడాల్సి ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఈ వారం బిగ్బాస్ ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రచ్చ రచ్చ చేశారు..
తాజాగా విడుదలైన బిగ్ బాస్ టాస్క్ ఈ మిర్చి చాలా హాట్ గురు.. ఈ టాస్క్ లో అందరు ఎవరికి వారే అన్నట్లు రెచ్చిపోయారు.. ఈ టాస్కులో భాగంగా కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి ఎవరు కెప్టెన్ అవుతారనేది మిగతా ఇంటి సభ్యుల నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని అన్నారు బిగ్బాస్. ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉండకూడుదని భావిస్తారో ఆ హౌస్మేట్ మెడలో మిర్చి దండను వేయాల్సి ఉంటుందని ఆదేశించాడు.. మొదట అమర్ వచ్చి, ప్రశాంత్ కు మిర్చి దండను వేస్తాడు..
భోలే మాట్లాడుతూ.. నాకు కనపడ్డ ఐదుగురిలో ప్రస్తుతం ఇప్పుడు నువ్వు అంటూ చెప్పగా.. ఇప్పుడు నేను ప్రశాంత్ లాగా మాట్లాడలా.. అమ్మా పక్కకు వెళ్లి ఆడుకోమ్మా అన్నట్లుగా ఉందంటూ సీరియస్ అయ్యింది ప్రియాంక. మధ్యలో ప్రశాంత్ గురించి ఎందుకు తీస్తున్నావ్ అని భోలే అడగడంతో నేను తీసుకుంటున్నా అంటూ రివర్స్ అయ్యింది.. ఇక రతిక శోభా మెడలో వేస్తుంది.. అలాగే యావర్ కూడా శోభాకు వెయ్యాలని అనుకుంటాడు.. పిచ్చొడు.. పిచ్చోడు అంటా అంటూ యావర్ మీద మీదకెళ్లి అరిచేసింది. దీంతో సహనం కోల్పోయిన యావర్.. నన్ను పిచ్చోడివి అంటావా అంటూ మిర్చి దండను నెలకేసి కొట్టాడు. వీరిద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. మిర్చి దండను తనకు తానుగా మెడలో వేసుకుని పిచ్చిగా బిహేవ్ చేసింది శోభా.. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. ఇకపోతే ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ కెప్టెన్ అయినట్లుగా సమాచారం..