నామినేషన్స్ నుండి తప్పించుకున్న ఆ ముగ్గురు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 మొదలై చూస్తుండగానే ఇరవై రెండు రోజులై పోయింది. మొత్తం 19 మందితో మొదలైన ఈ షోలో ఇప్పటికీ ముగ్గురు పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. చిత్రంగా ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకా ఎవరూ రాలేదు. ఈ వారం వస్తారేమో చూడాలి. అయితే… మొదటి వారం ఆరుగురిని, రెండోవారం ఏడుగురిని, మూడోవారం ఐదుగురిని బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉంచారు. అత్యధికంగా ఈసారి ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ నాలుగు వారాల్లో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సార్లు నామినేషన్ జోన్ లోకి వచ్చారు. వ్యూవర్స్ వేసిన ఓటింగ్ లేదా బిగ్ బాస్ వ్యూహంలో భాగంగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. కానీ ముగ్గురు మాత్రం ఇంతవరకూ అసలు ఒక్కసారి కూడా నామినేట్ కాకపోవడం విశేషం.
బుల్లితెర నటుడు విశ్వ అందులో ఒకరు. కండలు పెంచిన దేహంతో కాస్తంత గొంతు పెంచి మాట్లాడే విశ్వలో మరో కోణం కూడా ఉంది. ఒక్కోసారి అందరి మీద నోరుచేసుకునే ఈ వ్యక్తి… ఠక్కున కన్నీళ్ళు కూడా పెట్టేసుకుంటాడు. ఫ్యామిలీతో బాండింగ్ బాగా ఉన్న విశ్వ… ఇంతవరకూ సోలోగానే తన గేమ్ ఆడుతూ వస్తున్నాడు. అతను ఈ నాలుగు వారాల్లో ఒక్కసారి కూడా నామినేషన్స్ లో లేడు. అలానే మరో వ్యక్తి షణ్ముఖ్. డాన్స్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ తో చక్కని గుర్తింపు తెచ్చుకున్న షణ్ణు… వెబ్ సీరిస్ లోనూ నటించి, అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే… షణ్ణుకు యూత్ మంచి క్రేజ్ ఉంది. అయితే… అతను నామినేషన్స్ లో ఉంటే.. ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందనేది కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇంతవరకూ షణ్ణు నామినేషన్స్ జాబితాలో చేరలేదు. ఇక మూడో వ్యక్తి శ్వేతా వర్మ. వెండితెర నటిగా ఓ మాదిరి గుర్తింపును పొందిన శ్వేతవర్మకు ఇప్పుడిప్పుడే పలు అవకాశాలు లభిస్తున్నాయి. ఏ విషయంలో అయినా చాలా క్లారిటీతో ఉండే శ్వేత కూడా నామినేషన్స్ రొంపిలో ఇంతవరకూ పడలేదు. మరి ఈ ముగ్గురు ఎంతకాలం ఆ ట్రాప్ లో పడకుండా సేఫ్ జోన్ లో ఉంటారో చూడాలి.
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!