బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీ కోసమే ఈ న్యూస్.. ఇటీవల కాలంలో భారీగా ప్రభుత్వం భర్తీ చేస్తుంది.. ముఖ్యంగా బ్యాంక్ జాబ్స్ ను ఎక్కువగా విడుదల చేస్తుంది.. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 2100 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, చివరి తేదీ మొదలగు విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య: 2100పోస్టుల వివరాలు..
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్(జేఏఎం), గ్రేడ్ ఓ-800 పోస్టులు; ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్(ఈఎస్‌ఓ)-1300 పోస్టులు..
అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు..
01.11.2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం..
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాది రూ.6.14 లక్షలు నుంచి రూ.6.50 లక్షలు, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ.29,000 నుంచి రూ.31,000..
ఇంటర్వ్యూ ప్రక్రియ..
ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు..
దరఖాస్తు ప్రక్రియ..
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.12.2023.
ఆన్‌లైన్ పరీక్ష తేది: జేఏఎం పోస్టులకు 31.12.2023, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30.12.2023..
ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ https://www.idbibank.in/ ను పరిశీలించగలరు..