తెలుగులో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. విమర్శలు, ప్రశంసలు అందుకుంటుంది.. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్న సంగతి తెలిసిందే.. ఎప్పుడు ఏం ట్విస్ట్ ఇస్తాడో అని జనాలను ఆలోచనలో పడేస్తుంది.. సీరియల్ బ్యాచ్ తో పాటు కొత్త ముఖాలను కూడా హౌస్ లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్.. అందులో ఒకరు అశ్విని.. ఈ అమ్మడు గురించి చాలా మందికి తెలియదు.. నిజానికి ఈ అమ్మడు సినిమాలో నటిగా చేసింది.. ఈ అమ్మడు గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అశ్వినిని అక్టోబర్ 8వ తేదీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదుగురు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్.. హౌస్ లోకి వెళ్లిన తర్వాత అశ్విని తన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగు పెట్టినటువంటి ఈ అశ్విని ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే ఈమె ఇదివరకు ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అశ్వినికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతుంది..
అదేంటంటే ఈ అమ్మడు మహేష్ బాబు సినిమాలో కూడా నటించింది అట.. అవునా ఏ సినిమాలో అనే సందేహం రావొచ్చు..మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక రెండో అక్క పాత్రలో నటించారు. అశ్విని ట్రైన్లో జరిగే సన్నివేశాలలో కీలక పాత్ర పోషిస్తూ తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అశ్విని తరచూ తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇలా సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వచ్చిన ఈ అమ్మడును ప్రేక్షకులను ఎంతవరకు తీసుకెళ్తారో చూడాలి..