NTV Telugu Site icon

Ariyana Glory : ఆంటీలాగా ఉన్నావంటు దారుణమైన ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అరియానా..

Ariyana (2)

Ariyana (2)

బిగ్ బాస్ మాజీ హాట్ బ్యూటీ అరియానా గ్లోరీ పేరు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు.. బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో మెరుస్తుంది..ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు వరుస ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తుంది.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది.. బొద్దుగా మారి తన సొగసుతో కుర్రాళ్ళకి వల వేస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఆమె బాడీ పై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు గట్టిగా బుద్ది చెప్పింది.. తనను ఆంటీ అన్న వ్యక్తికి బాగానే బుద్ది చెప్పింది..

కొందరు ఆకతాయిలు మాత్రం అరియనా లావు కావడంతో అసభ్యంగా మెసేజ్ లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఒక అకౌంట్ నుంచి అరియనాకి పదే పదే అసభ్యకర మెసేజ్ లు వస్తున్నాయట. సీత అనే పేరు పెట్టుకుని ఒక ఆకతాయి అసభ్యంగా మెసేజ్ లు పెడుతున్నట్లు అరియనా వాపోయింది..ట్రోలింగ్ చేస్తున్న వారికీ అరియనా ఘాటుగా వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ గా మారింది. పనీపాటా లేని వేస్ట్ ఫెలోస్ కోసమే ఇది. సన్నగా ఉన్నప్పుడు ఏంటి ఇంత సన్నగా ఉన్నావ్ అంటారు. లావు అయితే ఏంటి ఇంతలావు అయ్యావ్ ఆంటీలాగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. నేను లావు అయితే నీకేంటి సన్నగా అయితే నీకేంటి. అంత ఇబ్బందిగా ఉంటే అన్ ఫాలో చేయవచ్చు కదా. కనీసం నా లైఫ్ లో నేను ప్రోగ్రస్ అవుతున్నా. నువ్వేం చేస్తున్నావ్ రా.. సీతా అనే పేరుతో కామెంట్స్ చేస్తున్నావ్. పనీపాటా లేకపోతే పని చూసుకుకో అంటూ అరియనా కడిగి పడేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.