సాదారణంగా ఇంట్లో అందరు రకరకాల మొక్కలను పెంచుతారు.. అయితే కొన్ని మొక్కలను వాస్తు ప్రకారం ఉంచితే చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.. ఇంటిని మొక్కలు చెట్లతో పచ్చగా అలంకరిస్తూ ఉంటారు. కొందరు వాస్తు ప్రకారం గా కేవలం కొన్ని రకాల మొక్కలను మాత్రమే నాటితే ఇంకొందరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.. వాస్తును నమ్మేవారు ఇంటి డోర్ వద్ద కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల డబ్బులకు డోకా ఉండదని లక్ష్మి దేవి కటాక్షం ఉంటుందని చెబుతున్నారు.. ఆ మొక్కలు ఏంటో ఓ లుక్ వేద్దాం పదండి..
మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్కను నాటడం వల్ల మంచి జరుగుతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక రెండవ మొక్క మల్లె మొక్క. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో డబ్బు ఆదాయం పెరగాలంటే, మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద మల్లె మొక్కను పెంచడం మంచిది. ఇది మీ ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా ఆదాయ వనరులను కూడా సృష్టింస్తుంది. మూడవ మొక్క పామ్ మొక్క. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటే మీరు అలాంటి వాతావరణం నుండి బయటపడాలనుకుంటే మెయిన్ డోర్ కు ఎదురుగా పామ్ చెట్టును పెంచడం మంచిది..
ఇకపోతే మనీ ప్లాంట్. వాస్తు శాస్త్రం ప్రకారం , మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద పెరగాలంటే, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా మనీ ప్లాంట్‌ను ఉంచాలి. ఇది డబ్బును ఆకర్షించడమే కాకుండా ఇంట్లో ఆనందం శ్రేయస్సును కూడా తెస్తుంది. ఇక చివరిగా ఐదవ మొక్క ఫెర్న్ మొక్క. వాస్తు శాస్త్రంలో ఫెర్న్ మొక్క అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.. అలాగే ఇంట్లో గొడవలను పోగొట్టి సంతోషాలను వెల్లు విరిసేలా చేస్తుంది… తమలపాకు మొక్కలు కూడా మంచివే.. ఈ మొక్కలలో ఏదోక మొక్కను నాటడం మంచిది.. నాటి చూడండి మార్పులు మీకే తెలుస్తుంది..
