ఈ మధ్య జనాలు ఎక్కువగా వాస్తును నమ్ముతున్నారు.. వాస్తు ప్రకారం అన్ని ఇంట్లో పెడుతున్నారు.. శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అటువంటి సందర్భాలలో వస్తువులను ఉంచే ముందు సరైన స్థలాన్ని ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇంట్లో వస్తువులనే కాదు, బయట ఉండే చెప్పులను కూడా సరిగ్గా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.. చెప్పులు సరిగ్గా లేకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బయట వదిలే చెప్పులు క్రమ పద్దతిలో లేకుండా ఉంటే ఇంట్లో వాళ్లకు అనేక రకాల సమస్యలు వస్తాయట.. ఇంటి ముందు ఉన్న చెప్పులు లేదా బూట్లు తలకు తలకిందులుగా ఉంచినట్లయితే లక్ష్మీదేవి కలత చెందుతుంది అని చెబుతున్నారు. ఆగ్రహానికి గురవుతుందని చెబుతున్నారు.. ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి.. అందుకే చెప్పులను ఇంట్లో ఉంచకూడదని, అలా ఉంచితే పేదరికం వస్తుందని నిపుణులు చెబుతున్నారు..
ఇంట్లో చెప్పులు లేదా బూట్ల ను తలకిందులుగా ఉంచడం వల్ల ఇంట్లో గ్రహాల సమస్య పెరుగుతుందని జ్యోతిష్యా నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా లక్ష్మీ మాత కూడా కోపం తెచ్చుకొని ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదు.. అలా చెప్పు తిరగల పడితే ఇంట్లో వారి ఆలోచనల పై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు..ఇంట్లో అనారోగ్యం, బాధలు మొదలవుతాయి.ఇందుకోసం చెప్పులు, బూట్లు తలకిందులు గా కనిపిస్తే వెంటనే వాటిని సరి చేయాలి. ఎప్పుడూ చెప్పులు బూట్లు తలకిందులుగా ఉండకూడదు. ఇలా ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పోయి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.. అమ్మవారు సంతోషిస్తారు.. దాంతో సుఖ సంతోషాలు వెల్లు విరిస్తాయి.. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి..
