NTV Telugu Site icon

Vastu Tips : పూజ గదిలో పచ్చ కర్పూరాన్ని ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా?

Pacha Karpooram

Pacha Karpooram

మన ఇంట్లో పూజ గదిలో ఎలాంటి వస్తువులను ఉంచాలి.. ఎటువంటి వస్తువులను ఉంచకూడదో తెలుసుకోవాలి.. కొన్ని వస్తువులను ఉంచితే ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటాయి.. ఇప్పుడు మనం పచ్చ కర్పూరం ను పూజ గదిలో ఉంచితే ఏమౌతుందో తెలుసుకుందాం..

పచ్చ కర్పూరం వాసన గొప్ప శక్తిని కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా పూజ గదిలో రెండు లేదా నాలుగు పచ్చ కర్పూరాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుందని కూడా చెబుతున్నారు.. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.. ఇక పచ్చ కర్పూరం వాసన ఇంట్లో ఉండడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు పచ్చ కర్పూరం తప్పకుండా ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ పచ్చ కర్పూరం ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది.అలాగే పచ్చ కర్పూరాన్ని పసుపు గుడ్డలో కట్టి కుబేరుని మూలలో ఉంచి ధూపం, పూజలు చేస్తే ఇంట్లో ధన ప్రవాహం ఉంటుందని చాలా మంది ప్రజలు కూడా నమ్ముతారు.. ఇంట్లో దీన్ని ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది.. గొడవలు రావడం తగ్గుతాయి.. ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.. ఇంట్లో ఎప్పుడూ పచ్చ కర్పూరం పెట్టుకోవడం మంచిదని ఈ పండితులు చెబుతున్నారు. ఇంట్లో ప్రశాంతత, సుఖం, సంతోషం, శ్రేయస్సు కలగాలంటే పచ్చ కర్పురాన్ని ఉపయోగించడం ఎంతో మంచిది. పచ్చ కర్పూరాన్ని ఒక చిన్న బౌల్ లో ఉంచి ఒక్కొక్క గదులలో ఉంచితే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.