ఉత్పన్న ఏకాదశి.. ఈరోజు చాలా పవిత్రమైనది..ఈరోజు ఎక్కువగా ఉపవాసం ఉంటారు.. పురాణ గ్రంధాల్లో ఏకాదశి ఉపవాస విశిష్ట గురించి పేర్కొన్నారు. ఏకాదశి వ్రతాన్ని పాటించడం, లోక రక్షకుడైన విష్ణువును అన్ని నియమ నిష్టలతో పూజించడం ద్వారా చేసిన అన్ని రకాల బాధల నుంచి విముక్తి కలుగుతుంది.. ఉత్పన్న ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరి, మరణానంతరం శ్రీవిష్ణువు అనుగ్రహంతో వైకుంఠ లోక ప్రాప్తితో పాటు మోక్షాన్ని కూడా పొందుతాడని విశ్వాసం… ఇక ఈరోజు ఏం చెయ్యాలి.. ఏం చెయ్యకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈరోజు ఉపవాసం శుభసమయం.. ఉదయం 5:06 గంటలకు ప్రారంభమై రేపు అంటే డిసెంబర్ 9వ తేదీ ఉదయం 6:31 గంటలకు ముగుస్తుంది. ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని డిసెంబర్ 8 , 9 తేదీలలో ఆచరించవచ్చు. మీరు ఈరోజు డిసెంబర్ 8వ తేదీన ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నట్లయితే.. ఉపవాసాన్ని విరమించే సమయం డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 1:01 నుండి 3:20 వరకు ఉంటుంది. మీరు ఈ సమయంలో మీ ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. మీరు డిసెంబర్ 9న ఉపవాసం ఉన్నట్లయితే, ఉపవాసం విరమించే సమయం డిసెంబర్ 10వ తేదీ ఉదయం 7:03 నుండి 7:13 వరకు ఉంటుంది.
ఈరోజు ఏం చెయ్యాలంటే?
*. ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా పవిత్రమైనది. ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
*. శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున ఉపవాసం పాటించండి.
*. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ రోజున, విష్ణువు పూజలో ఖచ్చితంగా తులసిని ఉపయోగించండి.
*. ఉత్పన్న ఏకాదశి రోజున సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఈ రోజున విష్ణుమూర్తికి పసుపు పండ్లు, పసుపు పువ్వులు సమర్పించాలి.
*.ఉత్పన్న ఏకాదశి రోజున దానధర్మాలు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున పేదవారికి ఆహారం, బట్టలు, డబ్బు మొదలైనవి దానం చేయండి. ఇలా చేయడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది.
*. ఈరోజు బ్రహ్మ చర్యం పాటించండి.. ఎవరిని నొప్పించకండి..
*. తప్పనిసరిగా విష్ణుమూర్తి మంత్రాలను పఠించాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు సంతోషిస్తాడు.
ఏం చెయ్యకూడదంటే?
*. ఏకాదశి రోజున ఎవరినీ దూషించకండి. ఎవరినీ వేధించకండి. ఇలా చేయడం వల్ల శ్రీ హరికి కోపం రావచ్చు.
*. ఉత్పన్న ఏకాదశి రోజున అన్నం తినడం నిషిద్ధమని భావిస్తారు. అందుకే ఈ రోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు. ఇలా చేయడం వల్ల పేదరికం వస్తుంది.
*. ఉత్పన్న ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి మొదలైన వాటిని తీసుకోవద్దు. ఈ రోజున తామసిక ఆహారాన్ని తినడం మానుకోవాలి.
*. ఈరోజు తులసి ఆకులను మీ చేతులతో తెంపకండి.. నిన్న కోసుకోవాలి లేదా బయట తెచ్చుకోవడం చెయ్యాలి.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఉపవాసం ఉండటం మంచిది..
