Ugadi 2026 Kanya Rashi Horoscope: తెలుగు రాష్ట్రాల్లో ఉగాదికి ఉన్న ప్రత్యేకత గురించి పెద్దగా చెప్పనవరసం లేదు. ఈ నెల 19న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాదిని ఘనంగా జరుపుకోనున్నారు. కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ ఏడాదిలో ఏ రాశి వాళ్లకు ఎలాంటి అనుభావాలు ఎదురవుతాయి? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అనే అంశంపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తెలుగు పంచాంగం ప్రకారం.. మనం కన్యా రాశి వాళ్లకు ఈ ఏడాది ఎలా గడుస్తుందో తెలుసుకుందాం..
READ MORE: Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. ఏడుగురు మృతి.!
కన్యారాశి వారికి ఈ సంవత్సరము 75% శుభ ఫలితాలు ఉండనున్నాయి. ఇక్కడ ఆదాయ వ్యయాలు ఇంచుమించు బాగానే ఉన్నాయి. ఆదాయం ఎనిమిది, వ్యయము 11, రాజపూర్జ్యము, అవమానం రెండు సరిసమానంగా(3) ఉన్నాయి. ఆదాయం బాగానే ఉన్నది. ఖర్చులు కొంచెం ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఖర్చు చేసేటటువంటి సందర్భంలో అది మంచి అభివృద్ధిని ఇచ్చేటటువంటి ఖర్చుగా చేయాలి. అంటే పెట్టుబడులుగా మార్చారు అనుకోండి అది భవిష్యత్తులో వినియోగం అవుతుంది. అలాగే ఇక్కడ రాజపూజ్యాలు సరిమానంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. 2025 సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి విజయవంతంగా ముందుకు సాగుతుంది. కాలం కారణం ఏంటంటే రాహువు ఆరవ రాశిలో ఉన్నారు. అలాగే మనం గమనించినట్లయితే ఈ గురువు కూడా లాభంలోకి వస్తారు. జూన్ తర్వాత కాబట్టి రెండు గ్రహాలు పెద్ద గ్రహాలు యోగిస్తున్నాయి. అంటే రాహువు ఇటు గురువు కాబట్టి అత్యధిక కాలం అనుకూలంగా ఉంది. రాహువు ఆరో రాశిలో ఉండడం వల్ల శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. జూన్ తర్వాత ఏకాదశస్థ ఉచ్చ బృహస్పతి విశేషమైనటువంటి దైవబలాన్ని ఇస్తున్నారు. ఆ సందర్భంలో గృహ నిర్మాణాది కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. ప్రతిభతో పెద్దల్ని మెప్పించి గొప్ప ఫలితాలను పొందుతారు. ధర్మబద్ధంగా ప్రయత్నాన్ని కొనసాగించాలి.
READ MORE: RGV Reviews: ధురంధర్-2’పై రామ్‌గోపాల్ వర్మ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లకు కీలక సలహా!
కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. విదేశీ యోగాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రయత్నం బాగా ముందుకు కొనసాగించాలి. అలాగే వీళ్లు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. రాహువు పంచమంలో ఉండడం వల్ల పంచమం అంటే సాధారణంగా సంతాన స్థానం సంతాన విషయంలో అలాగే పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక శని సప్తమ స్థానంలో ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది కానీ పార్ట్నర్షిప్ చేసేటటువంటి విషయాల్లో అక్కడ గొడవలు రాకుండా చూసుకోవాలి. వైవాహిక జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. ముఖ్యంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు లాభస్థానంలో ఉచ్చరాశిలో ఉన్న కారణం చేత ఈ సంవత్సరానికే అత్యంత గుర్తింపును సాధించే సమయం ఇది. కన్యారాశి వారు అంటే ఈ సమయంలో బాగా వారికి అభివృద్ధి చేకూరుతుంది. ద్వాదశ కేతువు మానసిక చైతన్యాన్ని తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు ఉత్సాహంతో ఆలోచన చేస్తూ ముందుకు సాగండి. ఆధ్యాత్మికంగా సమయాన్ని ఎక్కువగా గడపండి అదేవిధంగా ఈ సంవత్సరము శని ధ్యానంతో పాటుగా ఈ పంచమ రాహువు అంటే డిసెంబర్ నుంచి పంచమంలోకి వస్తారు. కాబట్టి శని రాహువుల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మేలైన ఫలితాన్ని ఇస్తుంది.
