NTV Telugu Site icon

Tuesday : మంగళవారం ఇలా చేస్తే చాలు.. ఆ దోషాలన్నీ తొలగిపోతాయి..

Anji Pooja

Anji Pooja

మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితం.. అందుకే ఆయన భక్తులు ఈరోజు ఆయనకు పంచ పరమాన్నాలతో పూజలు చేస్తారు.. నవగ్రహాల్లో అంగారకుడు అధిపతి ఆయన వల్ల కలిగే భాధల నుంచి విముక్తి పొందాలనుకొనేవారు హనుమంతుడును పూజించాలి.. అప్పుడే మనకు అన్ని రకాల భాధలు పూర్తిగా తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు.. మంగళవారం ఎలా ఆంజనేయ స్వామిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మంగళవారం 5 గంటలకు లేచి నదీ స్నానం లేదా ఇంట్లోనే శుభ్రంగా స్నానం చెయ్యాలి.. ఆ తర్వాత మంచి బట్టలు శుభ్రమైన బట్టలను వేసుకోవాలి. ఆ తర్వాత ఎనిమిది రేకులు కలిగిన తామర పూలను పూజలో ఉంచాలి… అలాగే ఎర్రటి ప్రసాదాలు అంటే కేసరి వంటి వాటిని నైవేద్యంగా ఉంచాలి.. అంతేకాదు మందారం వంటి ఎర్రని పూలతో పూజలు చేసినా మంచిదే.. పూజను చేసి త్వరగా ముగించాలి..

ఎరుపు రంగుల దుస్తులను ధరించాలి. ఎరుపు రంగులు ప్రసాదాలను కూడా సమర్పించాలి.. ఇలా నిష్టతో తొమ్మిది వారాలు చేస్తే అనుకున్న పనుల్లో విజయం సాధించడం మాత్రమే కాదు.. దోషాలాన్ని కూడా తొలగిపోతాయి.. వడమాలా పులిహోరను కూడా నైవేద్యంగా పెడితే చాలా మంచిది.. ఈ వ్రతాన్ని ఎటువంటి భంగాలు లేకుండా పూర్తి చేస్తే కోరికలు నెరవేరుతాయి.. పెళ్లిళ్లు త్వరగా అవుతాయి. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్దిల్లుతారని పండితులు చెబుతున్నారు.. ఇలా ఆయనను భక్తితో ప్రార్దిస్తే అన్ని దోషాలు తొలగి పోతాయి..