మనదేశం సాంప్రదాయలకు సంస్కృతులకు పెట్టింది పేరు.. అందుకే వాస్తు శాస్త్రన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు.. ఏదైనా వాస్తు ప్రకారం చెయ్యాలని అనుకుంటారు.. కొన్ని రోజులలో కొన్ని రకాల పనులు చేయకూడదు కొన్ని రకాల పనులు చేయవచ్చని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో మంగళవారం కూడా ఒకటి.. ఈరోజు తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు అస్సలు చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు.. హిందూమతంలో హనుమంతుడికి మంగళవారం అంకితం చేశారు. హనుమంతుడిని భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. హనుమంతుని అనుగ్రహాన్ని పొందుతాడు. మంగళవారం మీరు హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజించవచ్చు.. ఈరోజు చెయ్యకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మంగళవారం రోజు కొత్త ఇల్లు కొనకూడదు. కొత్త ఇల్లు కొని భూమి పూజ చేస్తే ధన నష్టం కలుగుతుంది. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. అలాగే మంగళవారం మీరు నల్ల బట్టలు కొనుగోలు చేయకూడదు. అలాగే మంగళవారం నాడు నల్లని దుస్తులు ధరించవద్దు. మంగళవారం మీరు ఎరుపు, నారింజ రంగు దుస్తులు ధరించాలి. మీ జాతకంలో కుజదోషం ఉంటే ఆ దోషం తగ్గుతుంది. అలాగే మంగళవారం నాడు ఎలాంటి ఇనుప పదార్థాలను కొనుగోలు చేయకూడదు..
ఇక మంగళవారం నాడు ఆడవాళ్లు ఎటువంటి కొత్త వస్తువులను ఇంటికి తీసుకురాకూడదని అంటున్నారు..మంగళవారం నాడు హనుమంతుడికి కుంకుమ సమర్పిస్తారు. కాబట్టి ఆ రోజు కుంకుమ కొనకూడదని అంటారు. ఇది వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు ఉంటాయి.అలాగే ఈ రోజు పాలతో చేసిన స్వీట్ ఏదీ కొనుగోలు చేయకూడదు. ఇది సంపద నష్టం, ఇంట్లో సమస్యలు దారితీస్తుంది. పాలు చంద్రుని మూలకం. అంగారకుడు, చంద్రుడు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. అలాగే ఈరోజు ఎవ్వరికి పాలు, స్వీట్స్ ఇవ్వకూడదు.. ఇవన్నీ పొరపాటున కూడా ఈరోజు చెయ్యకండి..
