Site icon NTV Telugu

Suryanarayana Temple: ఈ ఆలయానికి ఒక్కసారి వెళితే చాలు.. శని ప్రభావం జన్మలో ఉండదు..

Surya Bhagwan

Surya Bhagwan

మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా శని ప్రభావం ఉంటే ఎటువంటి పని జరగదు.. శని ప్రభావం వల్ల అనుకున్న పనులన్నీ కూడా వెనక్కి వెళతాయని పెద్దలు చెబుతుంటారు..శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, మానవ ప్రయత్నం సరిపోనప్పుడు మనం చూసేది భగవంతుడి వైపే అని కచ్చితంగా చెప్పవచ్చు..మనం ఈ రోజు పడుతున్న బాధ అంతా మన గ్రహ ప్రభావం వల్ల కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. అలాంటి గ్రహాలలో సూర్యభగవానుడు చాలా ముఖ్యమైనవాడు. ఆయన ఇతర గ్రహాలతో కలిసి వెలిసిన ప్రాంతం కుంభకోణంలోని సూర్యనారాయణ దేవాలయం.ఇది చాలా విశిష్టమైనది.శని బాధ నివారణ అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవాలంటే మీరు కచ్చితంగా ఈ దేవాలయానికి వెళ్లి తీరాల్సిందే.

ఎక్కడైనా నవగ్రహాలు శివుడు దగ్గరే ఉంటాయి.. కానీ తమిళనాడు లోని ఓ ఆలయంలో సూర్యనారాయణ దేవాలయంలో మాత్రం సూర్యుడే ప్రధానం అని స్థానిక పూజారులు చెబుతున్నారు.ఈ దేవాలయంలోని మూలవిరాట్ అయినా సూర్య భగవానుడు తన ఇద్దరి భార్యలతో భక్తులకీ దర్శనం ఇస్తాడు. మిగిలిన సూర్యదేవాలయాలలో సూర్యుడు తీవ్రమైన కిరణాలతో ఉంటే ఇక్కడ మాత్రం స్వామి వారు చిరు మందహాసంతో చేతులలో తామర పువ్వులు పట్టుకుని ఆశీర్వదిస్తూ ఉంటారు… అంటే శివుడు ముందు నంది ఉన్నట్లు ఈ ఆలయంలో సూర్యని ముందు గుర్రాలు ఉంటాయి..

సూర్య భగవానుడితోపాటు గురుడిని 11 ఆదివారలు పూజిస్తే ఏలినాటి శని తో పాటు ఇతర గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. ఈ దేవాలయం లో పూజ చాలా నిష్టగా ఉంటుంది. పూజ అనంతరం దేవాలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేయాలి. సూర్య భగవానుడి కి నైవేద్యంగా చక్కెర పొంగలి పెట్టాలి.. ఇలా చెయ్యడం వల్ల శని ప్రభావం మన మీద ఉండదని నిపుణులు చెబుతున్నారు..

Exit mobile version