Sri Ram Navami 2026: శ్రీరామ నవమి మార్చి 26న లేదా 27ననా..?.. శుభ సమయం, ఆచారాలు, ఉపవాస నియమాలు ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Ram Navami 2026: పండుగలపై తరచూ గందరగోళం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు శ్రీరామ నవమిపై కూడా అదే కన్ప్యూజన్ నెలకొంది.. ముఖ్యంగా శ్రీరామ నవమి అనేది శ్రీరాముని జన్మదినోత్సవం. హిందువులు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధతో జరుపుకుంటారు. భక్తులు ఈ రోజున పూజలు చేసి, శ్రీరాముని ఆశీస్సుల కోసం ప్రార్థిస్తారు. 2026లో రామ నవమి తేదీ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. కొందరు మార్చి 26న, మరికొందరు 27న జరుపుకోవాలని సూచిస్తున్నారు.
శ్రీరామ నవమి 2026 ఖచ్చితమైన తేదీ
పండితుల ప్రకారం శ్రీరామ నవమి 2026 మార్చి 26 ఉదయం 11:48 గంటలకు ప్రారంభమై, మార్చి 27 ఉదయం 10:06 గంటలకు ముగుస్తుంది. శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో, కర్కాటక లగ్నంలో జన్మించినందున, మార్చి 26వ తేదీని గృహస్థులకు శుభప్రదంగా పరిగణిస్తారు.. అయితే వైష్ణవ సంప్రదాయం ప్రకారం మార్చి 27న రామ నవమి జరుపుకోవడం శుభంగా ఉంటుంది అంటున్నారు..
శుభ సమయం: ఉదయం 11:13 నుండి మధ్యాహ్నం 1:41 వరకు
జన్మ శుభ సమయం: మధ్యాహ్నం 12:27
Also Read
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అత్యంత జాగ్రత్త.. మీరున్నారో చూసుకోండి!
- Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
- Diwali Horoscope 2026: దీపావళి రోజు దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
- Dhanteras 2026: బంగారం, వెండి కొనలేకపోతున్నారా? ధంతేరస్ రోజు బడ్జెట్లో ఈ 8 వస్తువులు శుభప్రదం
రామ నవమి పూజ విధానం
రామ నవమి రోజున భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, శ్రీరాముని పూజిస్తారు. కొంత మంది భక్తులు దేవాలయాలను సందర్శిస్తారు, మరికొందరు ఇళ్లలోనే పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున రామచరితమానసం పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పేదలకు, అవసరమైన వారికి ఆహారం, బట్టలు, ఇతర నిత్యావసర వస్తువులను దానం చేయడం సంప్రదాయంగా ఉంది.
ఉపవాస నియమాలు
ఉపవాసం పాటించే భక్తులు నిరాడంబరత, పవిత్రతను పాటించాలి. కొందరు నిర్జల ఉపవాసం (నీరు కూడా తాగకుండా) చేస్తారు, మరికొందరు కేవలం పండ్లు లేదా ఒకే పూట భోజనం చేస్తారు.
ఉపవాస సమయంలో తేలికపాటి, శుభ్రమైన ఆహార పదార్థాలు తీసుకోవచ్చు.. ముఖ్యంగా పండ్లు, పాలు, పెరుగు, సగ్గుబియ్యం, బక్వీట్, సింగాడా పిండి లాంటివి వాడొచ్చు.. ఉప్పుకి బదులుగా సైంధవ లవణం వాడవచ్చు. రోజంతా పూజలు, భజనలు, రామాయణం పఠనం చేయడం మనస్సును ప్రశాంతపరిచి భక్తిని పెంచుతుంది. సాంప్రదాయంగా, మధ్యాహ్న పూజ తర్వాత ఉపవాసం విరమిస్తారు.
శ్రీరామ నవమి రోజున ఏమి చేయకూడదు..
రామ నవమి రోజున గోధుమ, బియ్యం, పప్పు, ఇతర ధాన్యాలు తినకూడదు.. ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. బరువైన, వేయించిన ఆహారాలు తినకూడదు. కోపం, ప్రతికూల ఆలోచనలు, కఠినమైన మాటలకు దూరంగా ఉండాలి.
రామ నవమి మంత్రాలు
రాముని జపించే మంత్రాలు మనసుకు శాంతి, జీవితంలో సానుకూల శక్తిని చేకూరుస్తాయి:
“ఓం శ్రీ రామాయ నమః”
“శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్”
“ఓం నమో భగవతే రామచంద్రాయ”
అయితే, శ్రీరామ నవమి పండుగను భక్తిశ్రద్ధతో జరుపుకోవడం, ఉపవాసం పాటించడం, మంత్ర జపం చేయడం ద్వారా శుభప్రభావం, సానుకూల శక్తి, ఆత్మనిర్ధారణ పొందవచ్చు.
తాజావార్తలు
-
Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! ‘రామాయణ’ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
-
DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
-
Workplace Trends: 9 టు 5 ఉద్యోగాలకు కాలం చెల్లిందా? నేటి యువత కోరుకుంటోంది ఇదేనా!
-
CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
-
AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!