శ్రావణమాసం అమ్మావారులకు ప్రత్యేకమైన మాసం.. ఈ మాసంలో ఆడవాళ్లు ప్రత్యేక పూజలు చేస్తారు.. ఈ మాసం లో మహిళలు కొన్ని తప్పులను అస్సలు చెయ్యకూడదని నిపుణులు చెబుతున్నారు.. అలా చేస్తే ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందని చెబుతున్నారు. శ్రావణ మాసంలో మహిళలు అస్సలు దానం చేయకూడని వస్తువులు కూడా ఉన్నాయి. ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని పెద్దలు చెబుతూ ఉంటారు. రక్త దానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది..
ఎవరైనా అవసరంలో ఉన్న, ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేస్తే దాన్నే దానం అని అంటారు. చాలామంది అన్నదానం చేస్తుంటారు. అలాగే మరి కొంత మంది వస్త్రాలు దానం చేస్తూ ఉంటారు. ఏవైనా వస్తువులు కూడా దానం చేస్తూ ఉంటారు. ఇలా తమకు తోచిన దానం చేస్తూ ఉంటారు. శనివారాలలో నూనెను దానం చేస్తారు.. ఏదైనా దానం చేస్తే అది అవతలి సంతోష పడేలా చెయ్యాలి.. అయితే కొన్ని వస్తువుల గురించి తెలుసుకొని దానం ఇస్తే ఇద్దరికీ మంచిది..
ఇకపోతే ఈ మాసం అమ్మవారికి అంకితం.. అందుకే మహిళలు వ్రతాలు చేస్తుంటారు.. అయితే చీపురు, ఉప్పు, కారం, ఇనుము ఎప్పుడు దానం చేయకూడదు. ఈ విధంగా దానం చేసినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయి. అలాగే అనారోగ్య పాలవుతారు. కాబట్టి మహిళలు ఈ వస్తువులను ఎప్పుడు దానం చేయకూడదు. ఏ దానం చేసిన ఏ పూజ చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలి.. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.. కొన్ని నియమాలను పాటిస్తూ పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.. పూజలు చేసే టప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
