Surya Grahanam 2025: ఆదివారం అమావాస్య రోజే సూర్యగ్రహణం.. పాటించాల్సిన నియమాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surya Grahanam 2025: హిందూ మతంలో సూర్య గ్రహణానికి ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 21వ తేదీన ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్య గ్రహణం సంభవించనుంది. సెప్టెంబర్ నెలలో అంటే ఒకే నెలలో సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తున్నాయి. హిందూ శాస్త్రాల ప్రకారం ఇలా రావడం అపశకునంగా భావిస్తారు. అయితే.. రేపు ఆదివారం అమావాస్య. అంతే కాకుండా.. పాక్షిక సూర్య గ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం మనదేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం వర్తించదు. అయితే.. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడం వల్ల భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది. రేపు రాత్రి 11 గంటల నుంచి ఇది ప్రారంభమవుతుంది. మరుసటి రోజు (సెప్టెంబర్ 22) తెల్లవారుజామున 3:23 గంటల వరకు ఉంటుంది. ఈ గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేస్తారు. హిందూ ఆచారాల ప్రకారం.. సూర్యగ్రహణం నాడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
READ MORE: Mulugu : ములుగు జిల్లాలో కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖలు..అలర్ట్ అయిన పోలీసులు
Also Read
నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న నియమాల ప్రకారం.. సూర్యగ్రహణానికి రెండు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దు. గ్రహణం మొదలైనప్పుడు, పూర్తైన తర్వాత స్నానం కచ్చితంగా చేయాలి. అలాగే వేడినీటితో స్నానం చేయకూడదు. చన్నీళ్ల స్నానం చేస్తే మంచిదట. రజస్వల దోషాలు ఉన్నవారు గ్రహణ సమయంలో స్నానం చేయాలని సూచిస్తున్నారు. పురుడు(ఎవరైనా జన్మించినప్పుడు), సూతకం(మైల)లో ఉన్నవారు కూడా స్నానం చేయాలని చెబుతున్నారు. ఈరోజున తలస్నానం చేయాలని, తలంటు స్నానం చేయొద్దని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో నిద్రపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే గ్రహణం ముందు వండిన ఆహారాన్ని గ్రహణం పూర్తైన తర్వాత తినకూడదని చెబుతున్నారు. మళ్లీ వండుకుని అప్పుడు తినాలని సూచిస్తున్నారు. గర్భణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా.. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!