Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shravan Month Dreams: హిందూ శాస్త్రాలలో శ్రావణ మాసానికి అత్యంత పవిత్రమైన, ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మాసం దేవదేవుడైన ఆ పరమశివునికి చాలా ప్రీతికరమైంది. ఈ పవిత్ర రోజుల్లో భోళాశంకరునికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో కాన్వడియాలు పవిత్ర జలాన్ని తెచ్చి శివునికి జలాభిషేకం చేసే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం వల్ల మహాదేవుడు ప్రసన్నడై భక్తుల కోరికలు నెరవేరుస్తాడని నమ్ముతారు. దృక్ పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై 30 నుంచి ప్రారంభమై, ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమితో ముగుస్తుంది. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో శివునికి సంబంధించిన కొన్ని పవిత్ర చిహ్నాలు కలలో కనిపిస్తే.. అవి జీవితంలో రాబోయే అపారమైన సానుకూల మార్పులకు, శివయ్య ఆశీస్సులకు సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. ఆ అదృష్ట సంకేతాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. శివలింగం
శ్రావణ మాసంలో కలలో శివలింగాన్ని చూడటం అత్యంత శ్రేష్ఠమైన, గొప్ప అదృష్ట సూచనగా పరిగణించబడుతుంది. మీ కలలో గనక శివలింగం కనిపిస్తే భవిష్యత్తులో జీవితంలోని కష్టాలన్నీ, సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అంతే కాకుండా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అపారమైన విజయాలు, పురోగతి లభిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
- Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
- Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
2. సర్పం (పాము)
శివుని మెడలోని ఆభరణమైన సర్పం శ్రావణ మాసంలో మీ కలలో కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా శుభప్రదం. దీర్ఘకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయని దీని అర్థం. అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగై, లక్ష్మీ కటాక్షంతో పాటు మహాదేవుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని సంకేతం.
3. నంది
శివుని వాహనమైన నంది కలలో దర్శనమిస్తే మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. రాబోయే రోజుల్లో మీ కుటుంబంలోకి ఏదైనా పెద్ద శుభవార్త వచ్చే అవకాశం ఉందని ఈ కల సూచిస్తుంది.
4. మహాదేవుడు లేదా శివాలయం
శ్రావణ మాసంలో సాక్షాత్తు పరమశివుడు లేదా శివాలయం కలలో కనిపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయి సరికొత్త పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ వార్తలోని సమాచారం పూర్తిగా మత విశ్వాసాలు, స్వప్న శాస్త్ర నిబంధనలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!