Shiva Ashtakam: త్రిమూర్తులలో (బ్రహ్మ, విష్ణువు, శివుడు) శివుడు లయకారుడు. అంటే, ఆయన సృష్టిలోని పాత, అనవసరమైన, ప్రతికూల శక్తులను నాశనం చేసి, కొత్తదానికి మార్గం సుగమం చేస్తాడు. మన జీవితంలోనూ, మన మనస్సులోనూ ఉండే అజ్ఞానం, అహంకారం, చెడు కోరికలు వంటి వాటిని తొలగించి, ఆత్మశుద్ధికి సహాయపడతాడు. శివుడు భక్తుల పట్ల చాలా దయామయుడు, సాటిలేని కరుణ గలవాడని ప్రీతి. ఆయనను నిష్కపటమైన భక్తితో పూజిస్తే, ఆ కోరికలు న్యాయబద్ధమైనవైతే వెంటనే అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఆయనను భోళా శంకరుడు అని కూడా పిలుస్తారు కూడా. శివ అంటేనే మంగళకరం లేదా శుభకరం. శివుడిని పరమేశ్వరుడిగా, పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. ధ్యానం, యోగాకు ఆయన అధిపతి (ఆది యోగి). శివుడు మెడలో పాము, తలపై గంగ, నుదుటిపై మూడవ కన్ను కలిగి ఉంటాడు. ఇది ఆయన భయం లేని స్వభావాన్ని, కాలంపై విజయాన్ని (మృత్యుంజయుడు), లోతైన జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆయనను పూజించడం ద్వారా భక్తులు ఆ ఆత్మవిశ్వాసం, ధైర్యం, మనశ్శాంతి పొందుతారు. శివుడు రూపం లేనివాడు (నిరాకారుడు), అయినప్పటికీ లింగం రూపంలో పూజింపబడతాడు. ఆయన సకల చరాచర జగత్తులో వ్యాపించి ఉన్నాడు. శివలింగానికి అభిషేకం చేయడం అనేది ఆ పరమ శక్తికి మన అంకితభావాన్ని చూపించడానికి ఒక మార్గం. కాబట్టి నేడు శివుడిని పూజిస్తే శుభప్రదాలు కలుగుతాయి.
IND vs SA: హమ్మయ్యా గెలిచాం.. కానీ భయపెట్టిన దక్షిణాఫ్రికా..!
శివాష్టకం:
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే
గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్
జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే
ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్
అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే
వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే
గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్
బలీవర్ధయానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే
శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే
హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే
స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి.
Astrology: డిసెంబర్ 1, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్‌న్యూస్..!
