Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..

Shani Trayodashi

Shani Trayodashi

Shani Trayodashi 2026: జూన్ 27న శని త్రయోదశి వస్తోంది. శని త్రయోదశిని శని ప్రదోషం అని కూడా అంటారు. ఈ రోజున శని ప్రభావం ఎక్కువగా ఉన్న వారు అంటే, అష్టమ శని, అర్ధాష్టమని శని, ఏలినాటి శని కాలం నడుస్తున్న వారు శనికి తైలాభిషేకం చేయడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శని దేవుడి ప్రభావం తగ్గుతుందని భావిస్తుంటారు. అయితే, ఈ రోజున మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల శని పీడ మరింత పెరిగే అవకాశం ఉంది. పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయొద్దని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

ఈ తప్పులు చేయొద్దు..

1) శని త్రయోదశి రోజున ఇనుము లేదా ఇనుప వస్తువుల్ని కొనడం వల్ల ఇంట్లో పేదరికం, ఉద్రిక్తతలు పెరుగాయి. శని దేవుడికి నూనె సమర్పిస్తారు. అయితే, ఆ రోజున నూనె కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తారు. అందుకే ఒక రోజు ముందే నూనెను కొనుగోలు చేయండి. ఈ రోజున నల్ల నువ్వులు, తోలు వస్తువులు, చెప్పులు, బూట్లు కొనొద్దు.

2) గుడికి వెళ్లినప్పుడు శని దేవుడు కళ్లలోకి సూటిగా చూడొద్దు. దానికి బదులుగా ఆయన పాదాల వైపు చూస్తూ ప్రార్థనలు, ప్రదక్షిణలు చేయండి. ఆయనను సూటిగా చూడటం అశుభకరమైందిగా భావిస్తారు.

3) శని త్రయోదశి రోజున సాత్వికంగా ఉండాలి. ఆ రోజు మాంసం, మద్యం, గుడ్లు తినడం మానుకోండి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మీరు ఉపవాసం చేస్తున్నా లేదా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నా మీ ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు మానుకోండి.

4) శని దేవుడు న్యాయానికి అధిపతి. అణగారిన వర్గాలకు, పేదలకు, కార్మికులకు, నిస్సహాయులకు ప్రతీక. ఈ రోజున పేదలను, వృద్ధులను, పారిశుధ్య కార్మికులను, మూగ జంతువులను (నల్ల కుక్కలు లేదా ఆవుల వంటివి) కొట్టడం, వేధించడం వంటివి మానుకోండి. అలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగడానికి బదులుగా శని దేవుని తీవ్ర ఆగ్రహానికి గురికావచ్చు.

5) శని త్రయోదశి సాయంత్రం, ఇంటి ప్రధాన ద్వారం, పడమర వైపు చీకటి లేకుండా చూసుకోండి. సాయంత్రం పూట గుడిలో, ప్రధాన ద్వారం వద్ద తప్పకుండా దీపం వెలిగించండి. అంతేకాకుండా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, వడ్డీ డబ్బులు వసూలు చేయడం మానుకోండి.

ఇలా చేస్తే శని ఆశీస్సులు లభిస్తాయి.

శని త్రయోదశి రోజు ఉదయం లేదా సాయంత్రం రావి చెట్టు కింద అవాల నూనె దీపాన్ని వెలిగించి, కొన్ని నువ్వులు వేసి ‘‘ఓం షణ్ శనైశ్చరాయ నమ:’’ అనే మంత్రాన్ని జపించాలి. మీకు తోచినంతగా పేదలకు మినపప్పు, దుప్పటి లేదా చెప్పులు దానం చేయడం అత్యంత శుభంగా ఉంటుంది.