Site icon NTV Telugu

Saturday : శనివారం వెంటేశ్వర స్వామిని ఇలా పూజించండి..

Venkanna

Venkanna

శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు.. కలియుగ దైవం వెంకన్న అంటే చాల మందికి అపారమైన భక్తి.. కష్టాలను తీర్చడమే కాదు , కోరికలను కూడా తీరుస్తారని ఎక్కువగా నమ్ముతారు.. శనివారం స్వామిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు .. అందుకే భక్తులు ఈరోజు స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.. ఈరోజు స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తే అన్ని కష్టాలు పోతాయని నిపుణులు చెబుతున్నారు ఎలా పూజ చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి. పూజ గది లో వేంకటేశుని ప్రతిమ లేదా విగ్రహం లేదా దేవుడు పటాన్ని ఉంచి సాక్షాత్తు ఆ శ్రీహరిగా భావించాలి. దీపాల ను శుభ్రం చేసుకుని.. పువ్వులతో స్వామివారి పటాన్ని అలంకరించుకోవాలి. పూజగది, ఇంటిముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండితీరాలి…అప్పుడే లక్ష్మి దేవి అనుగ్రహం కూడా ఉంటుంది..

ఈరోజు స్వామికి ప్రత్యేకంగా పూజలు చెయ్యడం వల్ల వెంకన్న కటాక్షం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ముఖ్యంగా పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి, పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. స్వామికి పొంగలి అంటే చాలా ఇష్టం.. మీ పూజ లో ఈ ప్రసాదం తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.. ప్రతి శనివారం ఇలా ప్రతి శనివారం చేస్తే చాలా మన కోరికలు నెరవేరడమే కాదు.. లక్ష్మీ దేవి కృప కూడా మనపై ఉంటుంది…. ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని చదవడం మర్చిపోకండి..

Exit mobile version