NTV Telugu Site icon

Saturday :శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఏం చెయ్యాలో తెలుసా?

Sani (2)

Sani (2)

మన హిందూ సంప్రదాయంలో గ్రహణం కు ప్రత్యేకత ఉంది.. గ్రహణం జీవితాలపై శుభా అశుభ ఫలితాలను ఇస్తుంది. నేడు సూర్యగ్రహణం..ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది.. అలాగే ఈరోజు సర్వ పితృ అమావాస్య .. శనివారం కావడంతో శని అమావాస్య కూడా.. హిందువులు శని అమావాస్యన పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు చేసే దానధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుచేత ఈరోజు పేదలకు వీలైనంత సహాయం చేయండి. ఆకలి అన్నవారికి ఆహారాన్ని అందించండి.. ఈరోజు శనీశ్వరుడి అనుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలి.. ఏం చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రహణం రోజున తులసి మొక్కను పూజించకండి. అంతేకాదు తులసి ఆకులను కోయవద్దు. ఇలా చేయడం వలన లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది. సూర్యగ్రహణం సమయంలో ఇంట్లో ఉండే ఆహార వస్తువులపై దర్భలను వేసి ఉంచండి. అంతేకాదు వండిన ఆహార పదార్ధాలు నిల్వ లేకుండా చూసుకోండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు లేదా పదునైన వస్తువులను ఉపయోగించకూడదు..

అమావాస్య రోజున ప్రతికూల శక్తులు చురుగ్గా ఉంటాయని.. ఒంటరిగా వెళ్లడం, నిర్జల ప్రాంతాలకు వెళ్ళకూడదని నిపుణులు చెబుతున్నారు.. అందుకే ఈ రోజు నిర్జన ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలని ముఖ్యంగా మానసికంగా బలహీనమైన ఉన్నవారు నిర్జల ప్రదేశానికి వెళ్లవద్దని పెద్దలు సూచించారు.గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం సరైనది కాదు. గ్రహణానికి ముందు తులసి ఆకులను కలిపిన నీటిని మాత్రమే సేవించండి.. గ్రహణం వదిలాకా అన్ని క్లీన్ చేసుకొని ఆహారం తీసుకోవడం మంచిది..