Sabarimala Alert: అయ్యప్ప భక్తులకు అలర్ట్.. పంబా నదిలో బట్టలు పడేస్తే భారీ ఫైన్.. ఆ ఆచారానికి చెక్..

Sabarimala Alert

Sabarimala Alert

Sabarimala Alert: అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల వెళ్లే భక్తులకు అధికారులు కీలక హెచ్చరిక జారీ చేశారు. పవిత్ర పంబా నదిలో దుస్తులు పడేయడం లేదా వదిలేయడం ఇకపై కుదరదు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రూ.5,000 వరకు జరిమానా విధించనున్నారు. నదిలో దుస్తులు వదిలేయడంపై అధికారులు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. అయితే, శబరిమల యాత్రకు వచ్చే కొందరు భక్తులు స్నానాలు చేసిన అనంతరం ధరించిన దుస్తులను పంబా నదిలోనే వదిలేస్తున్నారు. ఇలా ప్రతిరోజూ టన్నుల కొద్దీ దుస్తులు నదిలో పేరుకుపోతున్నాయి. దీంతో నది నీరు కలుషితమవుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు పాటిస్తున్న ఈ అనుచిత ఆచారం పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా నది పవిత్రతకు కూడా విఘాతం కలిగిస్తోంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 వేల వరకు ఫైన్
పంబా నదిని కాలుష్యం నుంచి కాపాడటంతో పాటు దుస్తుల వ్యర్థాలను అరికట్టేందుకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. నదిలో దుస్తులు పడేయడం, వదిలేయడం నిషేధించారు. నిబంధనలను ఉల్లంఘించే భక్తులకు రూ.5,000 వరకు జరిమానా విధించనున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులు పంబా నది పరిశుభ్రతను కాపాడాలని అధికారులు సూచిస్తున్నారు. నదిలో దుస్తులు వదిలేయకుండా నిబంధనలను పాటించాలని కోరుతున్నారు. భక్తి పేరుతో పర్యావరణానికి హాని కలిగించే ఆచారాలకు స్వస్తి పలకాలని, పవిత్ర పంబా నది పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.