Site icon NTV Telugu

Pushpaka Vimana Story: రావణుడు పుష్పక విమానాన్ని ఎవరి నుంచి లాక్కున్నాడు..?

Bhakthi

Bhakthi

Pushpaka Vimana Story: దేశ వ్యాప్తంగా విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు ఆనందోత్సవాల నడుమ దసరా వేడుకలు చేసుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు(రేపు) శమీ పూజ, ఆయుధ పూజ, వాహనాలకు పూజలు చేసుకొనున్నారు. ఒకరికొకరు జమ్మీ ఆకు ఇచ్చిపుచ్చుకుంటూ ఆత్మీయ ఆలింగానాలు చేసుకుని శుభాకాంక్షలు తెలుయజేసే సన్నివేశానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. రావణాసురుని దహన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. అయితే.. ప్రస్తుతం మనం రావణుడు పుష్పక విమానాన్ని ఎవరి నుంచి లాక్కున్నాడు..? అనే విషయం గురించి తెలుసుకుందాం..

READ MORE: Modi-Trump meet: ట్రేడ్ వార్ నేపథ్యంలో, మలేషియాలో మోడీ-ట్రంప్ సమావేశానికి ఛాన్స్..

శ్రీ రామచరితమానస్ లోని ఈ ఘట్టం ప్రకారం.. పుష్పక విమానానికి యజమాని సంపదకు అధిపతి అయిన కుబేరుడు. దేవతలు, రాక్షసుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి బ్రహ్మ దేవుడు అతనికి ఈ విమానాన్ని ప్రసాదించాడు. రావణుడు కఠినమైన తపస్సు చేసి శివుడి నుంచి వరాలు పొందిన విషయాన్ని చదివే ఉంటాం. ఈ తపస్సుతో శక్తి అనేక రెట్లు పెరిగింది. దీంతో రావణుడు దేవతలపై దాడి చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో తన సవతి సోదరుడైన కుబేరుడిపై యుద్ధానికి సవాలు చేస్తాడు. వాస్తవానికి.. రావణుడి కంటే ముందు లంకను కుబేరుడు పాలించాడు. యుద్ధంలో రావణుడు కుబేరుడిని ఓడించి, లంకను జయించాడు. కుబేరుని పుష్పక విమానాన్ని కూడా బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. కుబేరుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఈ విమానం రావణుడి సామ్రాజ్యం, శక్తికి చిహ్నంగా మారింది. రావణుడి మరణం తరువాత.. రాముడు, సీత, లక్ష్మణుడు ఇదే పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చారని చెబుతారు.

READ MORE: Modi-Trump meet: ట్రేడ్ వార్ నేపథ్యంలో, మలేషియాలో మోడీ-ట్రంప్ సమావేశానికి ఛాన్స్..

Exit mobile version