Bakthi: కాలం మారిన ఎంతగా అభివృద్ధి చెందిన కొన్ని అలవాట్లు మాత్రం మారవు. అలా అప్పటికి ఇప్పటికి, ఎప్పటికి మనల్ని వీడని అలవాట్లలో ఒకటి ఎవరైనా అబద్దం చెప్తున్నట్లు అనిపిస్తే వెంటనే ఏది ఒట్టేసి చెప్పు అని అడగడం. సరదాగా అలా ఒట్టేస్తే పర్లేదు కానీ.. ఈ గుడిలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రమాణం చేసి అబద్దం చెప్పకూడదు. అలా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు కొందరు అనుభవజ్ఞులు. ఇంతకీ ఆ ఆగుడి ఎక్కడ ఉంది. దాని విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh Chathurthi: విఘ్నేశ్వరునికి తులసి ఆకులతో పూజ చేయకూడదు ఎందుకో తెలుసా..?
చిత్తూరు జిల్లా లోని కాణిపాకంలో కొలువు తీరిన వరసిద్ధి వినాయకుడిని కలియుగంలో కష్టాలు తీర్చే దైవంగా ఆరాధించే భక్తులు ఎందరో ఉన్నారు. ఇక చిన్న చిన్న విషయాలకు అబద్దాలు చెప్పే వ్యక్తులు కూడా కాణిపాకం వినాయకుని గుడిలో అబద్ధం చెప్పాలంటే ఆలోచిస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ముందు నిలుచుని ప్రమాణం చేసి అబద్దం చెప్తే ఆ తరువాత తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తారు అక్కడి స్థానికులు మరియు భక్తులు. హా ఏముందిలే అని అబద్దం చెప్పి కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళు చాలామంది వున్నారని కొందరు అంటే.. మరికొందరు మేము ప్రత్యక్షంగా చూసాము అలాంటి వాళ్ళని అంటున్నారు. ఏదేమైనా ఈ గుడిలో అబద్దం చెప్పడానికి మాత్రం ప్రజలు భయపడతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
