Site icon NTV Telugu

Navratri : నవరాత్రి ఉపవాసాల్లో వీటిని తీసుకోవడం మంచిది..

Fasting

Fasting

మన హింద మతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఈరోజు నుంచి 23 వరకు ప్రారంభం అవుతుంది..ఈ పండుగలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు.. తొమ్మిది రూపాలలో పూజించడం తో పాటు ప్రత్యేక ప్రసాదాలను కూడా నైవేద్యంగా పెడతారు..అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు నవరాత్రులలో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. వ్రత సమయంలో కొంతమంది నీళ్లు మాత్రమే తాగినా, చాలా మంది పండ్లు కూడా తింటారు. అంతే కాదు కొందరు రోజుకి ఒకసారి ఆహారం కూడా తీసుకుంటారు.. ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉపవాస సమయంలో ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. అలాంటప్పుడు బుక్వీట్ పిండిని తీసుకోవచ్చు. ఆహారంగా తీసుకోవచ్చు. దీంతో రోటీ లేదా పరోటా తయారు చేసుకోవచ్చు. దీన్ని తినడం వల్ల పొట్ట నిండుగా ఉండడంతో ఆరోగ్యంగా ఉంటారు..

సగ్గుబియ్యంతో కిచిడి..లడ్డూ మొదలైనవి ఉపవాస సమయంలో తినే ప్రసిద్ధ వంటకాలు . ఇవి కూడా చాలా తేలికగా జీర్ణమవుతాయి. దీన్ని స్వీట్ లేదా హాట్ గా చేసుకుని తినవచ్చు.

ఇకపోతే స్మూతిలను ఎక్కువగా తీసుకుంటారు.. అలాంటి వారు బనానా స్మూతిలను కాకుండా యాపిల్స్ తో చేసుకొని తాగడం మంచిది..

ఉపవాస సమయాల్లో ఎక్కువగా నీటిని తాగడం మంచిది.. ఎందుకంటే బాడీ డీహైడ్రేషన్ కు గురవ్వకుండా ఉంటుంది.. అందుకే కనీసం మూడు లీటర్లు తాగడం మంచిది..

పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఉపవాస సమయంలో శరీరానికి శక్తి అవసరం, అటువంటి పరిస్థితిలో తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్ తినాలి. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది మరియు ఆకలి వేయదు..

ఇక ఇలాంటి సమయాల్లో పెరుగును తీసుకోవడం మంచిది.. ఎందుకంటే శక్తి రావడం తో పాటు, తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.. వీటిని తీసుకోవడం మర్చిపోకండి..

Exit mobile version