Site icon NTV Telugu

Yama Deepam 2025: రేపు యమ దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది?

Naraka Chaturdashi 2025

Naraka Chaturdashi 2025

Yama Deepam 2025: దేశ వ్యాప్తంగా ఈ రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. శ్రీకృష్ణుడు ఈ రోజున నరకాసురుడిని చంపాడు. నరకాసురుడు 16 వేల మంది బాలికలను బందీలను చేసుకున్నాడు. ప్రజలను హింసలకు గురి చేస్తున్న నరకాసురుడిని శ్రీకృష్ణుడు చంపడంతో ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఈ విజయాన్ని ప్రజలు దీపాలు వెలిగించి, సంబరాలు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ రోజును నరక చతుర్దశి లేదా ఛోటీ దీపావళిగా జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. ప్రతి ఏడాది నరక చతుర్దశి సాయంత్రం యమ దీపం వెలిగించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజున యమ దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే శుభాలు జరుగుతాయో తెలుసా..

READ ALSO: Bigg Boss 9 : నాగార్జున చేసిన పనికి ఏడ్చేసిన కంటెస్టెంట్లు

హిందూ క్యాలెండర్ ప్రకారం.. నరక చతుర్దశి ఈ ఏడాది అక్టోబర్ 19 ఆదివారం జరుపుకుంటారు. చతుర్దశి తిథి అనేది అక్టోబర్ 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 గంటల వరకు ఉంటుంది. నరక చతుర్దశి నాడు సాయంత్రం ప్రదోష సమయంలో యమ దీపం వెలిగిస్తారు. ఇది అకాల మరణ భయాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈసారి నరక చతుర్దశి నాడు యమ దీపం వెలిగించి పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి రెండు వేర్వేరు శుభ సమయాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అక్టోబర్ 19, 2025న సాయంత్రం 5:50 నుంచి 7:02 వరకు యమ దీపం వెలిగించడానికి శుభ సమయం అని చెబుతున్నారు. అంటే ఈరోజు శుభ సమయం దాదాపు గంటసేపు మాత్రమే ఉంటుంది. అభ్యంగ స్నానానికి శుభ సమయం అక్టోబర్ 20, 2025న ఉదయం 5:13 నుంచి 6:25 వరకు ఉండనుంది. అభ్యంగ స్నాన ప్రాముఖ్యత శారీరక శుద్ధికే పరిమితం కాదని, ఇది ఆధ్యాత్మిక శుద్ధీకరణ, సానుకూల శక్తి ప్రసరణ, ఆరోగ్యం, మానసిక సమతుల్యతను కాపాడుకోవడాన్ని సూచిస్తుందని జ్యోతిష్యులు వెల్లడిస్తున్నారు.

నరక చతుర్దశి రోజున పేద వ్యక్తికి, బ్రాహ్మణుడికి లేదా ఆహారం కోరుకునే ఎవరికైనా బియ్యం, గోధుమలు లేదా పెసలు… దానం చేయడం చాలా శుభప్రదం అని సూచిస్తున్నారు. గ్రంథాలలో ఆహారాన్ని దానం చేయడం “గొప్ప దానం”గా పేర్కొన్నారు. ఈ రోజున భక్తితో, నిస్వార్థంతో ఆహారాన్ని దానం చేసేవారు పేదరికం, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారని విశ్వసిస్తున్నారు. దానాలు చేస్తే చేసిన వారి కుటుంబంలో ఆహారం, సంపద, అదృష్టం పెరుగుతాయని చెబుతున్నారు.

లక్ష్మీ దేవికి వీటిని సమర్పించండి..
లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి నరక చతుర్దశి రాత్రి అత్యంత శుభప్రదమైన సందర్భంగా జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజున లక్ష్మీ దేవికి వెండి నాణెం లేదా స్వచ్ఛమైన కౌరీ పెంకులను సమర్పించడం చాలా ఫలవంతమైనదిగా వెల్లడిస్తున్నారు. కౌరీ లేదా వెండి నాణెంను మీ ప్రార్థనా స్థలంలో ఉంచాలని, అనంతరం పూజ తర్వాత వాటిని మీ సేఫ్, నగదు పెట్టె లేదా మీరు మీ డబ్బును ఉంచే ఇతర ప్రదేశంలో సురక్షితంగా పెట్టాలని సూచిస్తున్నారు. అలా చేయడం వలన లక్ష్మీదేవి నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతున్నారు.

READ ALSO: Diwali 2025 Muhurat Trading: రేపు స్టాక్ మార్కెట్‌కు సెలవు లేదు.. ముహూర్తపు ట్రేడింగ్ ఎప్పుడంటే!

Exit mobile version