Vaikunta Ekadasi: శ్రీ మహా విష్ణువు వైకుంఠ ఏకాదశి రోజు మూడు కోట్ల దేవతలకు, భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తాడు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ రోజు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు విశేషంగా కొనసాగుతాయి. తిరుమలలో శ్రీనివాసుడి ఆలయం, శ్రీరంగంలో రంగనాథుని ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామాలయంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో ఇస్తున్నారు. ఈ దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు పోటెత్తుతారు. అసలు ఉత్తర ద్వార దర్శనానికి ఎందుకంత పవిత్రమైన రోజు? ఏడాదిలో ఒక్క ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి? వంటి అంశాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం..
Read Also: Vaikuntha Ekadashi: నేడే వైకుంఠ ఏకాదశి.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
పౌరాణిక గాథ..
అయితే, ‘ముర’ అనే రాక్షసుడు వరగర్వంతో దేవతలను ఇబ్బంది పెడుతుండగా దేవతలు శ్రీ మహా విష్ణువుని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి యుద్ధానికి వస్తున్నాడని తెలిసి ముర సముద్రంలోకి వెళ్లి దాక్కుంటాడు. అప్పుడు విష్ణువు మురను వెతుక్కుంటూ వెళ్లి అలిసిపోయి ఒక గుహలో పడుకుంటాడు. ఇంతలో ముర ఆ గుహలోకి వెళ్లిన.. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక శక్తి వచ్చి మురను హతమారుస్తుంది. ఆ చర్యకు సంతోషించిన విష్ణువు తన శరీరం నుంచి వచ్చిన ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి ఆమెను ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఏకాదశి మురను చంపిన రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పోగొట్టమని శ్రీనివాసుడిని కోరుతుంది. దానికి స్వామి తథాస్తు అని, వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుందని వరం ప్రసాదిస్తాడు.
Read Also: Russia Ukraine War: టెన్షన్.. టెన్షన్.. పుతిన్ నివాసం వద్ద ఉక్రెయిన్ డ్రోన్ దాడులు..
మధుకైటభులకు వైకుంఠ ప్రాప్తి
మధుకైటభులనే రాక్షసులు బ్రహ్మ దేవుడి నుంచి స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొంది తమ అకృత్యాలతో భూమిపై ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తారు. బ్రహ్మ విన్నపం మేరకు విష్ణువు వారితో యుద్ధానికి రెడీ అవుతాడు. అయితే, వర ప్రభావంతో వారు ఓడిపోలేదు.. ఈ విషయాన్ని గ్రహించిన నారాయణుడు వారిని ఏదైనా వరం కోరుకోమని చెప్తాడు.. వారు అహంకారంతో ‘మేమే నీకు వరం ఇస్తాం’ ఏం కావాలో కోరుకో అని శ్రీ మహా విష్ణువు తన చేతిలో వారు మరణించాలని వరం కోరుకుంటాడు. ఇచ్చిన మాట మేరకు మధుకైటభులు శ్రీ మహా విష్ణువు చేతిలో ఓడిపోయి చనిపోతారు.
ఉత్తర ద్వారం అంటే!
శ్రీనివాసుడు శాశ్వతంగా నివసించే వైకుంఠాన్ని చేరుకోవాలని కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. అయితే, ఈ విషయంలో భక్తులకు అనేక అనుమానాలు ఉంటాయి. ఒక్క ఉత్తర ద్వారం నుంచి తప్ప వేరే ఏ ద్వారం నుంచి వెళ్లినా వైకుంఠంలో కొన్ని రోజులు మాత్రమే ఉంటారని.. కానీ ఉత్తర ద్వారం నుంచి వైకుంఠానికి వెళితే శాశ్వతంగా శ్రీ మహా విష్ణువు సన్నిధిలో ఉండొచ్చు అని భక్తుల నమ్మకం.
శాశ్వత విష్ణు సాయుజ్యమే పరమార్ధం
అందుకే వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహా విష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే పునరావృత్తి రహిత శాశ్వత విష్ణు సాయుజ్యాన్ని పొందొచ్చు. ఇదే ముక్కోటి రోజు జరిగే పవిత్ర ఉత్తర ద్వార దర్శనంలోని పరమార్థం. ఈ అంతరార్థాన్ని గుర్తించి వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగుతాయి. కాగా, ఈరోజు ( డిసెంబర్ 30) ముక్కోటి ఏకాదశి కావడంతో వైష్ణవ ఆలయాలకు భక్తులు భారీగా వెళ్తున్నారు.
