Money : మట్టి కలశంతో ఇలా చేస్తే ఆదాయం పెరుగుతుంది..డబ్బులే డబ్బులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో రూపాయి మీద ప్రపంచం నడుస్తుంది.. పుట్టుక నుంచి చావు వరకు అన్నీ కూడా పైసల్ ఉంటేనే జరుగుతున్నాయి.. డబ్బులుంటేనే మర్యాద కూడా ఉంటుంది..డబ్బు లేకపోతే మనిషిని కనీసం మనిషిగా కూడా చూడడం లేదు..ప్రస్తుతం రాత్రి పగలు అని తేడా లేకుండా చాలా మంది డబ్బులు సంపాదించడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లైఫ్ లో మంచిగా ఎదగాలని చాలా కష్టపడుతుంటారు. కానీ ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో మిగలడం లేదు అని బాధపడుతూ ఉంటారు. సంపాదించిన డబ్బు మిగలకపోగా అప్పులు చేయాల్సి వస్తోందని కొందరు చెబుతుంటారు.. అందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక చిన్న మట్టి కుండ తీసుకోవాలి. ఇందులో రూపాయి నాణాలు 5 ఉంచాలి. వాటితో పాటుగా బియ్యం, గోధుమలు, బార్లీ వంటి ఇతర ధాన్యంతో కలశం నింపాలి. ఈ కలశాన్ని ఎర్రని వస్త్రంతో కప్పి దారంతో కట్టి మూసెయ్యాలి. ఇప్పుడు దీన్ని లక్ష్మీ పూజలో ఉంచాలి. పూజ తర్వాత ఈ కలశాన్ని డబ్బు దాచే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చెయ్యడం వల్ల కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రోజులు గడిచేకొద్ది కాలం కలిసి రావచ్చు. ఈ పరిహారంతో పాటు జ్యోతిష్యులు చెప్పిన పరిహారాలను కూడా పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.. డబ్బులు ఆదా అవుతాయి..
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని దారంతో కట్టాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయను లక్ష్మీ పూజలో ఉంచి పూజ చెయ్యాలి. ఆ తర్వాత దాన్ని డబ్బు దాచుకునే చోట భద్రపరచుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.. అదే విధంగా ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవి అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజ చేసుకుని పసుపు వేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటికి రమ్మని ఆహ్వానించాలి.. గుడి నుంచి వచ్చిన తర్వాత కూడా అమ్మవారిని పూజించాలి.. అప్పుడే అమ్మవారి కటాక్షం ఉంటుంది.. ఇలా పదకొండు శుక్రవారాలు చెయ్యడం వల్ల మంచి ఫలితారు ఉంటాయి.. ఈ పరిహారాలన్ని చేసి మంచి ఫలితాలను పొందండి..
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!