NTV Telugu Site icon

Monday : శ్రావణమాసం లో సోమవారం ఇలా చేస్తే.. మీరు పట్టిందల్లా బంగారమే..

Sivudu (2)

Sivudu (2)

శ్రావణమాసం శివుడుకు ఎంతో ప్రత్యేకమైన మాసం.. శ్రావణ సోమవారం నాడు శివుడిని ఆరాధించడం వల్ల కోరకున్న ఫలితాన్ని పొందుతారని నమ్మకం ఉంది. అలాగే మీకు సుఖసంతోషాలు, సౌభాగ్యాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.. అసలు శ్రావణ సోమవారం ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శివుడికి నీటిని పెట్టడం ద్వారానే సంతోషిస్తాడని సనాతన గ్రంధాలలో నమ్ముతారు. అందుకే శ్రావణ సోమవారం నాడు భక్తులు శివుడికి నీటితో అభిషేకం చేస్తారు.. శ్రావణ మాసం సోమవారం కూడా ఉపవాసం ఉంటారు. శివుడిని పూజిస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయని నమ్మతారు. అలాగే ఇంట్లో సంతోషం, సౌభాగ్యం, అదృష్టం పెరుగుతాయని చెబుతున్నారు..

శ్రావణ మాసం చివరి సోమవారం నాడు స్నానం చేసి ధ్యానం చేయాలి. ఆ తర్వాత పరమేశ్వరుడికి తేనె, గంధం కలిపిన గంగా నీటితో అభిషేకం చేయాలి. ఈ జలాభిషేకం పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం.. దాంతో మీ కోరికలు నెరవేరుతాయి..

శివుడు ఎంతో దయగలవాడు. కరుణామయుడు. కేవలం పండ్లు, పూలు, నీరు మాత్రమే ఈ దేవుడుకి ఎంతో ఇష్టమట. మీరు కూడా మహాదేవుని అనుగ్రహం పొందాలనుకుంటే పూజ సమయంలో ఆయనకు మారేడు ఆకులు, ధతురా, మందార పువ్వులు, విరిగిపోని బియ్యాన్ని సమర్పించండి. వీటితో పాటు గోధుమలు స్వీట్స్ పెట్టినా మంచిదే..

శ్రావణ సోమవారం నాడు శివుడికి పచ్చి పాలతో అభిషేకం చేయండి. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే శివుని అనుగ్రహం లభిస్తుంది..శ్రావణ సోమవారం నాడు శివుడిని పూజించిన తర్వాత తెల్లని వస్తువులను దానం చేయండి. పాలు, పెరుగు, అన్నం ను దానం చేయొచ్చు.ఈ పని చెయ్యడం వల్ల శివుడు మిక్కిలి సంతోషిస్తాడు..

సోమవారం నాడు పంచాక్షరీ మంత్రం ‘ఓం నమః శివాయ’ జపించండి. మీరు దుఃఖం, రోగాల నుంచి విముక్తి పొందాలనుకుంటే స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి మీకు పట్టిందల్లా బంగారమే..

Show comments