NTV Telugu Site icon

Mangalasutra: మంగళ సూత్రంను ఇలా వేసుకుంటున్నారా? మీకు ఆ కష్టాలు తప్పవు..

Mangala Sutra

Mangala Sutra

మన దేశంలో సంప్రదాయలకు విలువను ఇస్తారు.. అందుకే వివాహ వ్యవస్థ ఇప్పటికి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు.. తాళి బొట్టుకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. అలాగే తాళి బొట్టును దేవుడి ప్రతికగా కొలుస్తారు. ముఖ్యంగా వివాహమైన ఆడ వారు తప్పనిసరిగా మంగళ సూత్రాన్ని ధరించి ఉంటారు.. తన భర్త ప్రాణం అందులో ఉందని నమ్ముతారు.. అందుకే మంగళసూత్రాన్ని ఎంతో పవిత్రంగా చూస్తారు.. అయితే మంగళ సూత్రాన్ని ఎలా ధరిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

సాదారణంగా ఈ మంగళ సూత్రం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధరిస్తారు. కొన్ని ప్రాంతాలలో కేవలం నల్ల పూసల దండ మాత్రమే మంగళ సూత్రంగా భావించి ధరిస్తారు. మరి కొంత మంది మహిళలు నల్ల పూసలు వాటి మధ్యలో బంగారు రంగు పూసలను ధరిస్తారు.. ఇలా పూసలు వేసుకోవడం వల్ల వాళ్లు పసుపు కుంకాలతో ఎప్పుడూ సుమంగళిగా ఉంటారని నమ్ముతారు.. అయితే ఈ నల్లని పూసలు శివుడికి ప్రతికగా ప్రజలు భావిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే బంగారు వర్ణం పూసలు పార్వతి దేవికి ప్రతికగా భావిస్తారు. అలాంటి మంగళ సూత్రాల పై కొంత మంది వారి ఇంటి కుల దైవం, ఇష్టమైనటు వంటి దేవుళ్లను మంగళ సూత్రంపై వేయించుకుంటూ ఉంటారు..

కానీ అలా అస్సలు చెయ్యకూడదని పండితులు చెబుతున్నారు.. ముఖ్యంగా మంగళ సూత్రంపై లక్ష్మీదేవి ప్రతిమ అసలు ఉండకూడదని చెబుతున్నారు.అలా ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి మంగళ సూత్రంపై దేవుడి ప్రతిమలు ఉండకుండా చూసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అలాగే కొందరు పిన్నులను కూడా సూత్రాలకు అస్సలు పెట్టకూడదు.. ఎందుకంటే భర్తకు మంచిది కాదు.. అలాగే ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడుతాయని ప్రముఖులు చెబుతున్నారు.. ఎంతవరకు మంగళ సూత్రానికి నల్ల, ఎర్ర పూసలు మాత్రమే ఉంచాలి.. ఇది గుర్తుంచుకోండి..

Show comments