Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
- బుధుడు, శుక్రుడి కలయికతో శుభ యోగం
- మేష రాశికి కొత్త ఆదాయ మార్గాలు
- కర్కాటక రాశికి ఉద్యోగంలో పురోగతి
- తుల, కుంభ రాశులకు ఆర్థిక లాభాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshmi Narayana Yoga: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి , వాటి కలయికలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 26న బుధ గ్రహం తులారాశిలోకి ప్రవేశించనుంది. అప్పటికే ఆ రాశిలో ఉన్న శుక్రుడితో బుధుడు కలవడం వల్ల ఎంతో శక్తివంతమైన ‘లక్ష్మీనారాయణ యోగం’ ఏర్పడబోతోంది. జ్యోతిష్యం ప్రకారం జ్ఞానం, ప్రతిభ, నైపుణ్యాలకు బుధుడు కారకుడు కాగా, సంపద, ఐశ్వర్యం, సుఖసంతోషాలకు శుక్రుడు అధిపతి. ఈ రెండు శుభ గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ఈ రాజయోగం నవంబర్ 6 వరకు కొనసాగి, కొన్ని రాశుల వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపనుంది. విశేషమైన ఈ యోగం వల్ల ఏ ఏ రాశుల వారు కెరీర్, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో అపారమైన పురోగతిని, ఆర్థిక లాభాలను సాధించబోతున్నారో వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి: కొత్త రాబడులు , వ్యాపార విస్తరణ
మేష రాశి జాతకులకు తులారాశిలో ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం సమసప్తమ స్థానంలో రూపుదిద్దుకోవడంతో జీవితంలో పెద్ద సానుకూల మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ఎదురవుతున్న చిక్కులు తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడి, వాటి ద్వారా అనూహ్యమైన లాభాలు అందుతాయి. వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే మీ నిరీక్షణ ఈ సమయంలో ఫలించి మంచి ఫలితాలను ఇస్తుంది. పూర్వపు పెట్టుబడుల నుంచి అనుకోని రీతిలో లాభాలు వెల్లువెత్తుతాయి. అయితే, కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.
Also Read
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
కర్కాటక రాశి: ఉద్యోగంలో పదోన్నతులు , బలీయమైన ఆర్థిక స్థితి
కర్కాటక రాశి వారికి ఈ యోగం అనేక విధాలుగా కలిసిరానుంది. చాలా కాలంగా ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఆఫర్లు అందుతాయి. మీరు నిర్వర్తించే ప్రాజెక్టులు విజయవంతమై, కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి పూర్తి మద్దతు , ప్రశంసలు అందుకోవడంతో పాటు మీ హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించి ఆర్థికంగా అత్యంత బలంగా తయారవుతారు.
తులారాశి: ఆత్మవిశ్వాసంలో వృద్ధి , కొత్త అవకాశాలు
సొంత రాశిలోనే లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుండటంతో తులారాశి వారికి ఇది సువర్ణ సమయమని చెప్పవచ్చు. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం వరిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు లేదా జీతాల పెరుగుదల వంటి తీపి కబుర్లు అందుతాయి. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు దక్కడం, కొత్త భాగస్వామ్యాలు కుదరడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడమే కాకుండా, రాబడిని పెంచుకోవడానికి అనేక కొత్త మార్గాలు సుగమమవుతాయి.
కుంభరాశి: బకాయిల వసూలు , సగౌరవమైన గుర్తింపు
కుంభరాశి జాతకులకు అనుకూల స్థానంలో ఏర్పడిన ఈ లక్ష్మీనారాయణ యోగం వృత్తి, వ్యాపారాల్లో శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారి నైపుణ్యాలకు సరైన ప్రతిఫలం లభించి, వేతనాలు పెరిగే అవకాశం ఉంది. మీ కొత్త ప్రాజెక్టులు కస్టమర్లను విశేషంగా ఆకట్టుకోవడంతో సమాజంలో , పని చేసే ప్రదేశంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిలిచిపోయిన పాత బాకీలు చేతికి అందడంతో పాటు, దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించి మనశ్శాంతి లభిస్తుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!