NTV Telugu Site icon

Lakshmi Devi: లక్ష్మీదేవికి ఈ నైవేద్యం పెడితే చాలు.. అదృష్టం పట్టినట్లే..

Lakshmi Devi Oliwkvkiz5wf038t

Lakshmi Devi Oliwkvkiz5wf038t

శుక్రవారం అంటే లక్ష్మి దేవికి చాలా ఇష్టమైన రోజు.. ఈరోజు అమ్మవారిని పూజిస్తే మీ ఇంట్లో డబ్బులకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు..ఆర్థిక పరిస్థితిలు మెరుగుపడాలన్న డబ్బులు చేతిలో నిలవాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆమెను భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ఆమెకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహం మరింత తొందరగా లభిస్తుంది.. శుక్రవారం ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే మాత్రం అమ్మవారి అనుగ్రహం పొందాలి..లక్ష్మి దేవిని భక్తి శ్రద్దలతో పూజలు జరిపించాలి. సోమవారం 6 గంటలకు స్నానం చేసి మీగడను తీసుకొని చెక్క కవ్వంతో చిలికి వెన్నను తీయ్యాలి. పెరుగును చిలకడానికి చెక్క కవ్వన్నీ మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఇలా తయారు చేసుకున్న వెన్న పాడవ్వకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి..

ఇకపోతే శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకుని లక్ష్మీదేవి పూజ చేయాలి. ఇలా చేసే లక్ష్మీదేవి పూజలో సోమవారం చిలికి తయారుచేసుకున్న వెన్నకు పొడి చేసుకున్న పటిక బెల్లాన్ని కలిపి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించాలి. పూజ అయిపోయాక ఈ నైవేద్య వెన్న ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న పిల్లలకు తినిపించాలి. ఇలా 11 వారాల పాటు చేస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది.. ఇక మీరు సంపాదించిన సొమ్ము మొత్తం డబుల్ అవుతుంది.. కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. రావలసిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది.. మీరు కోటీశ్వర్లు అవుతారు..