Koti Deepotsavam Day 14 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం.. ఒకే వేదికపై విశేష కార్యక్రమాలు

Koti Deepotsavam Day 14 Liv

Koti Deepotsavam Day 14 Liv

Koti Deepotsavam Day 14 LIVE: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ యాజమాన్యం నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం దేదీప్యమానంగా వెలిగిపోతుంది.. ఇప్పటికే 13 రోజులు విజయవంతంగా సాగిన ఈ కోటి దీపయజ్ఞంలో ఇవాళ 14వ రోజులో భాగంగా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచేలా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం సందర్భంగా పలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. త్రిశక్తి స్వరూపిణి, విద్యాప్రదాయిని అయిన కొల్లూరు మూకాంబికాదేవికి మొట్టమొదటిసారిగా సౌభాగ్య అభిషేకం నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక పూజ భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.

అదేవిధంగా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి కోటిగాజుల అర్చన నిర్వహించనున్నారు. అమ్మవారి అనుగ్రహం కోసం చేపట్టనున్న ఈ విశేష అర్చనలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. మరోవైపు సంకష్టహర చతుర్థి శుభవేళ మహాగణపతికి ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించనున్నారు. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ స్వయంగా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని మహాగణపతికి క్షీరాభిషేకం చేయనున్నారు. శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవంతో పాటు మూకాంబికాదేవి సౌభాగ్య అభిషేకం, మహాలక్ష్మి కోటిగాజుల అర్చన, మహాగణపతి క్షీరాభిషేకం వంటి విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు. జగన్మాతతో పాటు శివకేశవుల అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఆ విశేష కార్యక్రమాలను లైవ్‌లో వీక్షించేందుకు ఈ కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..