Koti Deepotsavam 2026: కార్తీక మాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం–2026 వేడుకలు భక్తిభావంతో కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. ఈ మహోత్సవంలో భాగంగా నేడు (నవంబర్ 21, శనివారం) ఎనిమిదో రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కార్తీక శనివారం, కృష్ణపక్ష ద్వాదశి సందర్భంగా పలువురు పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, ప్రవచనాలు, విశేష పూజలు, కల్యాణోత్సవం భక్తులను అలరించనున్నాయి.
నేడు కోటి దీపోత్సవంలో ప్రత్యేక కార్యక్రమాలు
1. అనుగ్రహ భాషణం – శ్రీ జయేంద్రపురి మహాస్వామీజీ (బెంగళూరు శ్రీ కైలాష్ ఆశ్రమం), శ్రీ ఉమాకాంతానంద సరస్వతీ స్వామీజీ (హరిద్వార్ జూనా అఖాడా)
2. ప్రవచనామృతం – శ్రీ డి. హయగ్రీవాచార్యులు (ఆధ్యాత్మిక ప్రవచనకర్త)
3. వేదికపై పూజా కార్యక్రమాలు – నారసింహస్వామి మహాభిషేకం, స్వర్ణసింహ రక్షాకంకణపూజ, ఉజ్జయిని మహాకాళిని భస్మహారతి
4. భక్తులచే పూజ – నరసింహస్వామి విగ్రహాలకు రక్షాకంకణపూజ
5. కల్యాణోత్సవం – శ్రీ తులసీ దామోదర కల్యాణం
6. వాహన సేవ – పల్లకి సేవ
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులకు కనుల పండువ
ఎనిమిదో రోజు వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, శ్రీ డి. హయగ్రీవాచార్యుల ప్రవచనాలు భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించనున్నాయి. వేదికపై నారసింహస్వామికి మహాభిషేకం, ఉజ్జయిని మహాకాళికి భస్మహారతి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే భక్తుల చేతుల మీదుగా నరసింహస్వామి విగ్రహాలకు రక్షాకంకణ పూజ నిర్వహించనున్నారు. శ్రీ తులసీ దామోదర కల్యాణోత్సవం, పల్లకి వాహన సేవతో నేటి కార్యక్రమాలు మరింత ప్రత్యేకంగా నిలవనున్నాయి. కార్తీక మాస ఆధ్యాత్మిక శోభను చాటిచెబుతూ కొనసాగుతున్న కోటి దీపోత్సవంలో ఎనిమిదో రోజు కార్యక్రమాలు భక్తులకు భక్తి పారవశ్యాన్ని అందించనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్..

