Koti Deepotsavam Day3 LIVE: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం

Koti Deepotsavam

Koti Deepotsavam

కార్తీక మాస శోభతో, అశేష భక్తజన సందోహం మధ్య హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా జరుగుతున్న ‘కోటి దీపోత్సవం – 2026’ ఆధ్యాత్మిక మహోత్సవంలో నేడు మూడో రోజు వేడుకలు కనులపండువగా ప్రారంభం కానున్నాయి. కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని, అశేష భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక మహోత్సవంలో నేడు విశేష కార్యక్రమాలు కనులపండువగా జరుగనున్నాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని వేదికపై శివపరివారానికి కోటి పుష్పార్చన , బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనామృతం వంటి విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నేటి ప్రధాన ఘట్టంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగనుంది. భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని శ్రీ రామలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుతూ, ఈ అద్భుతమైన కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను క్రింది వీడియో లింక్‌లో వీక్షించవచ్చు.