Koti Deepotsavam Day 5: హైదరాబాద్‌లో భక్తి తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 మహోత్సవం నాలుగవ రోజు భక్తి వాతావరణంలో సాగింది. వేలాది మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియంలో దీపాలు వెలిగిస్తూ “ఓం నమః శివాయ” నినాదాలతో భక్తి కాంతులతో వెలుగులు నింపారు. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమై, 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం పొందిన ఈ మహోత్సవం, ప్రతి ఏడాది భక్తులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. కార్తీకమాస భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ దీపాల మహోత్సవం, “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రపంచానికి చాటుతోంది. నేడు కార్తీక పౌర్ణమి. ఐదో రోజు కోటి దీపోత్సవంలో విశేష పూజలు ఉండనున్నాయి.
READ MORE: Plane Crashe: అమెరికాలో కూలిన కార్గో విమానం.. ముగ్గురు మృతి
ఐదవ రోజు విశేష కార్యక్రమాలు 5-11-2025 (కార్తిక బుధవారం – పౌర్ణమి)
పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీఠం పీఠాధిపతి, మైసూరు) ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం ఉంటుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతం నిర్వహిస్తారు. వేదికపై మహాదేవునికి అన్నాభిషేకం, ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి పూజలు నిర్వహిస్తారు. భక్తులచే శివలింగాలకు భస్మాభిషేకం ఉంటుంది. శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం, పల్లకీ వాహన సేవతో ముగుస్తుంది.
