Koti Deepotsavam 2024 Day 16 LIVE: చిదంబరం శ్రీ నటరాజస్వామి శివగామసుందరి కల్యాణం..

  • ఘనంగా కొనసాగుతున్న కోటి దీపోత్సవం
  • శివనామస్మరణతో మారుమోగుతున్న ఎన్టీఆర్ స్టేడియం
  • చిదంబరం శ్రీ నటరాజస్వామి శివగామసుందరి కల్యాణం.
Koti Deepostavam

Koti Deepostavam

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. రేపు (సోమవారం) కోటి దీపోత్సవం ముగియనుంది. రోజుకో విశేష కార్యక్రమాలతో ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడుతుంది. దేవతా మూర్తుల కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ విజయవంతంగా కొనసాగుతోంది. భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి దీపాల పండుగలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే 15 రోజులు దిగ్విజయంగా ముగిసిన కోటి దీపోత్సవం కార్యక్రమం.. 16వ రోజు విశేష కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలలో చిదంబరం శ్రీ నటరాజస్వామి శివగామసుందరి కల్యాణం.. మరిన్ని కార్యక్రమాలు జరుగనున్నాయి.