NTV Telugu Site icon

Koti Deepotsavam 2024 Day 16: కోటిదీపోత్సవంలో తొలిసారి ఆకాశలింగ క్షేత్ర వైభవం..

Koti

Koti

కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.. హిందువులు ఈ నెలలో శివుడు, విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రంగా భావిస్తారు.. కార్తీక స్నానాలకు, ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రధమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.. ఇక, కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది. కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం శివనామస్మరణతో 16వ రోజు మార్మోగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులయ్యారు.

IPL 2025 Mega Auction: ఎస్ఆర్‌హెచ్‌ లోకి టాప్ స్పిన్నర్లు.. భారీ ధరకు అఫ్ఘాన్ స్పిన్నర్..

కార్తీక ఆదివారం వేళ ఈరోజు విశేష కార్యక్రమాలను నిర్వహించారు. 16వ రోజు వేడుకల్లో… కోటిదీపాల వెలుగులు.. సప్తహారతి కాంతుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఆధ్యాత్మిక గురువుల ఆశీర్వచనాలు, ప్రవచనాలు చేశారు. అంతేకాకుండా.. పంచభూతలింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగ ఆరాధన, కోటిదీపోత్సవంలో తొలిసారి ఆకాశలింగ క్షేత్ర వైభవం నిర్వహించారు. ఇలకైలాస ప్రాంగణంలో భక్తుల చెంతకు ఆదిదంపతుల విహారం చేశారు. అలాగే.. చిదంబరం శ్రీ నటరాజస్వామి, శివగామసుందరి కల్యాణం ఘనంగా జరిపించారు. చివరలో లింగోద్భవం, సప్తహారతులు, మహానీరాజనంతో 16వ రోజు కోటి దీపోత్సవం వైభవంగా ముగిసింది.

Sanjay Raut: సంజయ్ రౌత్.. 3 పార్టీలను ముంచాడు.. ముఖ్యంగా ఠాక్రేని..