Site icon NTV Telugu

Koti Deepotsavam 2024 Day 15 LIVE: అయోధ్య బాలరాముని మహాభిషేకం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం

Bhakthi Tv

Bhakthi Tv

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. రోజుకో విశేష కార్యక్రమాలతో ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడుతుంది. దేవతా మూర్తుల కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ విజయవంతంగా కొనసాగుతోంది. భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి దీపాల పండుగలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే 14 రోజులు దిగ్విజయంగా ముగిసిన కోటి దీపోత్సవం కార్యక్రమం.. 15వ రోజు విశేష కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలలో అయోధ్య బాలరాముని మహాభిషేకం, శ్రీ సీతారాముల కల్యాణోత్సవం.. మరిన్ని కార్యక్రమాలు జరుగనున్నాయి.

 

Exit mobile version