Koti Deepotsavam 2024 Day 14 LIVE: మధురై మీనాక్షి కల్యాణోత్సవం.. కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన

  • అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం
  • శివనామస్మరణతో మారుమోగుతున్న ఎన్టీఆర్ స్టేడియం
  • కనకదుర్గమ్మ విగ్రహాలకు కోటిగాజుల అర్చన
  • మధురై మీనాక్షి కల్యాణోత్సవం.
Bhakthi Tv

Bhakthi Tv

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ విజయవంతంగా కొనసాగుతోంది. భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి దీపాల పండుగలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 13 రోజులు దిగ్విజయంగా ముగిసిన కోటి దీపోత్సవం కార్యక్రమం.. 14వ రోజు విశేష కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలలో మధురై మీనాక్షి కల్యాణోత్సవం, వేదికపై కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన.. మరిన్ని కార్యక్రమాలు జరుగనున్నాయి.