NTV Telugu Site icon

Sriramanavami 2024 : ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణంను వెన్నెలలోనే ఎందుకు జరిపిస్తారో తెలుసా?

Whatsapp Image 2024 04 16 At 4.19.16 Pm

Whatsapp Image 2024 04 16 At 4.19.16 Pm

శ్రీరామనవమి రోజున దేశ వ్యాప్తంగా ఉన్న రామాలయాలల్లో సీతారాముల కళ్యాణంను అంగరంగ వైభవంగా జరిపిస్తారు.. ప్రత్యేక భజనలు, రాముని ఊరేగింపులతో ఊరువాడా సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఒక్క ప్రాంతంలో మాత్రం రాముడి కళ్యాణంను నవమి తర్వాత తొమ్మిదో రోజూ జరిపిస్తారు.. అందుకు కారణాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. అసలు నిజానిజాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఒకప్పుడు ఆంధ్రా, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు భద్రాచలంను ఎక్కువగా సందర్శించేవారు.. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలో కొలువైన కోదండరాముని ఆలయాన్ని ఆంధ్రా భద్రాచలం అంటారు.. ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో మాత్రం చైత్ర పౌర్ణమి నాడు నిర్వహిస్తారు. దానివెనుక ఒక పురాణ కథ ఉంది.. ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఏకశిలలో దర్శనమివ్వడం ఈ ఆలయ విశేషం. మహర్షులకు, తపోధనులకు, యజ్ఞ యాగాలకు ప్రసిధ్ది చెందింది..

పురాణాల ప్రకారం యాగ రక్షణ కోసం రామ, లక్ష్మణులు ఈ ప్రాంతానికి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారనీ అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.. అలాగే ప్రతి శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమికి వెన్నెలలో సీతారాముల కళ్యాణం జరిపిస్తారు.. విష్ణుమూర్తి, లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో..నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు.. అలా అక్కడ కళ్యాణంను వెన్నెలలో మాత్రమే జరిపిస్తారు.. గతంలో ఓ సారి ఆలయంలో నిర్వహించడం వల్ల ఇద్దరు మనుషులు ఆలయ ప్రాంగణంలో చనిపోయారు.. అందుకే ఇప్పుడు ఆలయం సమీపంలో కళ్యాణం నిర్వహిస్తారు.. రాష్ట్ర సీఎం స్వామివారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు.. ఆ తర్వాత పాన్పు సేవ రోజున వాటిని భక్తులకు సమర్పిస్తారు.. ప్రస్తుతం ఆ ఆలయ కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది..