మన దేశంలో భక్తులు ఎక్కువ.. దేవుడు అంటే భక్తి ఎక్కువ అందుకే వీధికి ఒక గుడి దర్శనం ఇస్తుంది.. అంతేకాదు ఇండియా లో ఆంజనేయ స్వామికి భక్తులు ఎక్కువగా ఉంటారు.. ఆయనను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల భక్తులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కష్టాలను గట్టెక్కిస్తాడని నమ్మకం..హనుమంతుడికి ఇష్టమైన వాటిలో తమలపాకులు అలాగే సింధూరం కూడా ఒకటి. హనుమాన్ ని పూజించేందుకు సింధూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కేసరి రంగులో ఉండే సింధూరం సమర్పించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయట. సింధూరంతో హనుమంతుని ఆరాధించిన వారికి తప్పక ఫ్రతిఫలం దక్కుతుంది.
సిందూరంతో చేసిన హనుమాన్ పూజ ఆయనను ప్రసన్నుడను చేస్తుంది. ఇలా సింధూరానికి హనుమంతుడికి విడదీయలేని సంబంధం ఉంది. సింధూర ధారణతో హనుమంతుడు కరుణించడంతో కోరిన కోరికలు తీరుస్తాడు. ముఖ్యంగా మంగళవారం రోజు ఆంజనేయుడికి సింధూర పూజ చేస్తే ఇంట్లోకి సౌభాగ్యం వస్తుంది. సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి… అందుకే చాలా మంది భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు..సింధూరాన్ని సమర్పించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
లంకకు సీతాదేవిని చూడటానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు సీతాదేవుడిని సిందూరం గురించి అడుగుతాడు..అప్పుడు ఆమె శ్రీరామచంద్రుడి దీర్ఘాయువు కోసం తాను ఈ సింధూరాన్ని తన నుదుటన ధరిస్తానని, అంతే కాదు ఇది ఆయనకు చాలా ఇష్టమని, దీన్ని ధరించిన తన ముఖాన్ని చూసిన శ్రీరాముడి ముఖంలో ప్రసన్నతను తాను గమనించగలుగుతానని అందుకే.. ఆయనకు నచ్చే విధంగా ఉండేందుకు గాను తాను సింధూరాన్ని ప్రతి నిత్యం ధరిస్తానని సమాధానం చెప్పిందట. కాస్త సింధూరం రాముడికి దీర్ఘాయువును ఇస్తే తాను తనువంతా సింధూరం ధరిస్తే రాముడికి మృత్యువే ఉండదని భావించి అప్పటి నుంచి ఆయన ఒళ్ళంతా సిందూరం పూసుకుంటాడని చరిత్ర చెబుతుంది.. ఇది మొత్తం కథ…
