Site icon NTV Telugu

Ganesh Idol Trunk: గణపయ్య విగ్రహంలో తొండం ఎటు వైపు ఉండాలంటే.. కుడి వైపా? ఎడమ వైపా?

Ganesh Idol Trunk

Ganesh Idol Trunk

Ganesh Idol Trunk: వినాయక చవితి పండుగ సందర్భంగా భక్తులు తమ ఇళ్లలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనవాయితీ. అయితే, ఈ గణేశుడి విగ్రహంలో ఆయన తొండం ఏ దిశలో ఉండాలిన్నది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, విగ్రహం సరిగా ప్రతిష్టించడం వలన శాంతి, సౌఖ్యం, సంపద లభిస్తాయి. మరి ఆ వివరాలేంటో ఒకసారి చూద్దామా..

ఈ టీవీ ధరకు SVU కారు కొనొచ్చు కాదయ్యా.. Hisense UX ULED సిరీస్‌ టీవీలు లాంచ్!

పండగనాడు ఇంట్లో దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఎడమవైపు మడచి ఉన్న తొండం కలిగిన గణేశ విగ్రహమే అత్యంత శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విగ్రహం శాంతి, సౌఖ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ఎడమ తొండం ఉన్న గణేశుడు భక్తుల కోరికలను తీర్చడంలో సహాయపడతాడని బాకుతుల నమ్మకం కూడా..

అదే విధంగా, కుడివైపు మడచిన తొండం గణేశ విగ్రహాన్ని సాధారణ గృహాల్లో ప్రతిష్టించడం అంత మంచిది కాదని కొందరు భావిస్తారు. కుడి వైపు తొండం వంగి ఉన్న విగ్రహాన్ని సిద్ధి వినాయకుడుగా పరిగణిస్తారు. దీనికి కారణం గణపతికి కుడి వైపున ఆయన భార్యలలో ఒకరైన సిద్ధి నిలబడి ఉండడం కారణం. కుడి వైపు తొండం ఉన్న విగ్రహం మోక్ష, ఆధ్యాత్మిక సాధనను సూచిస్తుంది.

థియేటర్ అనుభవం ఇంట్లోనే.. డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో Blaupunkt Mini LED టీవీలు వచ్చేశాయ్!

ముఖ్యంగా కుడి తొండం ఉన్న గణపతి విగ్రహానికి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించి, నియమ నిష్ఠలతో పూజించాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఎడమ వైపు తొండం ఉన్న విగ్రహాలకు అభ్యంతరమేమీ ఉండదు. కానీ, కుడి వైపు తొండం వంగిన విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసేటప్పుడు తప్పనిసరిగా నియమాలు పాటించాలని నిపుణులు అంటున్నారు. మనం గమనించినట్లయితే గుళ్ళలో ఉండే వినాయకుడి విగ్రహాలకు తొండం కుడి వైపునకు వంగి ఉంటుంది. కాబట్టి భక్తులు ఇంట్లో ఎడమ వైపు తొండం ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించడం శ్రేయస్కరం. ఇది జీవితంలో అడ్డంకులను తొలగించి, శాంతి, సంపదలను నింపుతుంది.

Exit mobile version