ఉత్తరాల వినాయకుడు.. ఈ పేరు వినడానికి చాలా కొత్తగా ఉంది.. కానీ ఇలాంటి ఆలయం ఒకటి ఉందని చెబుతున్నారు. ఇక ఆ ఆలయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం…
భక్తులకు ఏదైనా చెప్పుకోలేని బాధలు కలిగినప్పుడు ఈ గణపతికి ఉత్తరంలో రాసి హుండీలో వేస్తే చాలు. గణపయ్యే దానికి పరిష్కారం చూపిస్తాడని నమ్మకం. ఈ ఆలయం పేరు త్రినేత్ర గణపతి ఆలయం.. ఇక్కడ ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం.. ఈ వినాయకుడి గుడి పేరు త్రినేత్ర ఆలయం.. ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లా.. రణథంబోర్ లో ఉందీ ఉత్తరాల గణపతి ఆలయం. దీనిని రణభన్వర్ ఆలయం అని కూడా అంటారు. దేశంలోనే తొలి గణేశ ఆలయంగా చెబుతారు. ఆరావళి, వింధ్య పర్వతాల మధ్య ఉన్న సంగమ స్థానంలో ఈ ఆలయం ఉంది.. అక్కడ ఇళ్లల్లో ఎటువంటి శుభాకార్యం జరిగినా ముందుగా ఆ స్వామికి ఆహ్వానం పంపిస్తారు.. అక్కడ ముందుగా వినాయకుడికి పెట్టిన తర్వాత ఏదైనా చేస్తారని చరిత్ర చెబుతుంది..
రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు వివాహమాడే సమయంలో.. విఘ్నాధిపతిని ఆహ్వానించడం మరిచిపోయాడని చెబుతారు. దాంతో.. పెళ్లికి బయల్దేరిన కృష్ణుడి రథాన్ని ముందుకు సాగనివ్వకుండా దారిపొడవునా కోతులు పెద్దపెద్ద గుంతలు తవ్వాయట. అందుకు కారణం తెలుసుకున్న కృష్ణుడు గణపయ్యను క్షమాపణ కోరడంతో పాటు వారి పెళ్లి ఆహ్వానం కూడా పంపారని చరిత్ర చెబుతుంది.. ఇకపోతే బుధవారం ఈ ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. వన్యమృగాలు కూడా ఉండటంతో అధికారులు తగు జాగ్రత్తలను కూడా తీసుకుంటున్నారు.. ఎప్పుడైనా రాజస్థాన్ వెళితే ఈ ఆలయాన్ని దర్శించుకొని మీకోరికలను నెరవేర్చుకోండి..
