NTV Telugu Site icon

Vinayaka Chavithi: విఘ్నాలను తొలగించే వినాయక చవితి

Vighneshwara2

Vighneshwara2

విఘ్నాలను తొలగిస్తాడు.. వినాయకా అంటూనే ఆదుకువాడు.. ఆశివపార్వతుల ముద్దుల కొడుకు పుట్టినరోజే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈపర్వదినాన్ని కన్నులపండుగగా జరుపుకొంటారు.. భారతీయులకు సమాజంలో వినాయక చవితికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది, ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు, ఆ.. గణనాథుని కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం. వినాయకుడికి ఆరాధనలో జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు, బుధుడు, కేతు గ్రహాల అనుగ్రహ సిద్ధి ఉంటుంది. ఆవినాయకుడు ధూమకేతు గణాధ్యక్షుడు, మోక్ష కారకత్వానికి అధినాయకుడు కావడంతో కేతు గ్రహానికి అధిపతి అయ్యాడని, బుధుడి అనుగ్రహంతో విద్య, జ్ఞానప్రాప్తి, వ్యాపారాభివృద్ధి కలుగుతుందని, అలాగే, కుజ గ్రహం అనుగ్రహం వివాహ, అన్యోన్య దాంపత్యానికి చిహ్నం.. ఆఒక్క పార్వతీ తనయుడిని ఆరాధించడం వల్ల ఈ మూడు గ్రహాల అనుగ్రహం పొందవచ్చని జ్యోతిషశాస్త్రం పేర్కొంటోంది.

గణేశచతుర్థినాడు వినాయక ఆరాధాన కాలాన్ని.. ప్రకృతిని.. జీవుల్ని నియంత్రించే ఈశ్వరుడి అనుగ్రహంతో, అన్ని అవరోధాల్ని అధిగమించడానికి నిర్వహిస్తారు. తుండం అంటే ఖండించడం. విఘ్నేశ్వరుడు వక్రాలన్నింటినీ ఖండించే భవ్య రూపధారి. అభ్యుదయంలో.. పురోగతిలో ఏర్పడే విఘ్నాలే వక్రాలు. అడ్డువచ్చే వక్రాల్ని తొలగించే వక్రతుండ విజయకారకుడు.. వరసిద్ధి వినాయకుడు. గణపతి ఆరాధన యజ్ఞత్వం, దైవత్వం, మంత్రత్వం, ద్రవ్యత్వం అనే నాలుగు అంశాలతో కూడుకున్నదే. వినాయకుడు నాలుగు వేదాల్లో ఆవరించిన వేదమూర్తి, చతుర్భుజుడిగా బీజ, అండ, పిండ, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉండే మహోత్కట గణపతి. ఆయనకు చతుర్థినాడు ఉద్భవించిన చిన్మయ చిదానందుడిగా.. నాలుగు సంఖ్య ప్రధానంగా కలిగిన చవితి దేవరగా వినాయకుడు ప్రణతులు అందుకుంటున్నాడు. గజవదనుడిగా.. జగదానంద తేజోమయ ఆనందరూపుడిగా జయకర.. శుభకర వినాయకుడిగా చవితినాడు సాకారమై అనంత సౌభాగ్య సిరుల్ని అనుగ్రహించే ఆహ్లాదపూరితమైన గణేశారాధన పూర్ణత్వమైన ఆనంద యోగసాధన! ప్రేక్షకులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
CM KCR Bihar Tour: నేడు బీహార్‌ సీఎం కేసీఆర్‌.. బీహార్‌ సీఎంతో భేటీ